69వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమా పంట పండింది. అన్ని విభాగాల్లో తెలుగు చిత్రాలకు మొత్తంగా 11 పురస్కారాలు దక్కాయి. వీటిలో ఎస్ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’కు అత్యధికంగా ఆరు అవార్డులు దక్కాయి. సుకుమార్, అల్లు అర్జున్‌ల ‘పుష్ప: ది రైజ్’కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సహా రెండు అవార్డులు దక్కాయి. ‘ఉప్పెన’కు ఒక అవార్డు, ‘కొండపొలం’ సినిమాకు ఒక అవార్డు, నాన్ ఫీచర్ కేటగిరిలో ‘పురుషోత్తం చార్యులు’ అనే సినిమాకు ఒక అవార్డు దక్కాయి.


మొత్తంగా ఆరు జాతీయ అవార్డులను ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గెలుచుకోవడం విశేషం. జాతీయ అవార్డు చరిత్రలో ఇది మూడో అత్యధిక రికార్డు. ఈ జాబితిలో ఎనిమిది అవార్డులతో ఆమిర్ ఖాన్ ‘లగాన్’ మొదటి స్థానంలో నిలిచింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోనే జంటగా నటించిన ‘బాజీరావు మస్తానీ’ ఏడు అవార్డులతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘గాడ్‌మదర్ (హిందీ)’, ‘కన్నత్తిల్ ముత్తమిట్టల్ (తమిళం)’, ‘ఆడుకలం (తమిళం)’ సినిమాలు కూడా ఆరు అవార్డులను గెలుచుకున్నాయి.


ఆర్ఆర్ఆర్‌కు వచ్చిన అవార్డులు
1. బెస్ట్ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు)
2. బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ - కింగ్ సాల్మన్
3. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) - ఎంఎం కీరవాణి
4. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - కాలభైరవ (కొమరం భీముడో)
5. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ - శ్రీనివాస మోహన్
6. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ - ఆర్ఆర్ఆర్


పుష్పకు వచ్చిన అవార్డులు
7. జాతీయ ఉత్తమ నటుడు - అల్లు అర్జున్
8. ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీ ప్రసాద్


9. ఉత్తమ తెలుగు చిత్రం - ఉప్పెన
10. ఉత్తమ గేయ రచన - చంద్రబోస్ (కొండపొలం)
11. బెస్ట్ క్రిటిక్ (నాన్ ఫీచర్) - పురుషోత్తం చార్యులు


Also Read: National Film Awards 2023: జాతీయ ఉత్తమ నటుడిగా జెండా పాతిన మొట్టమొదటి తెలుగోడు - ఇది పుష్ప రూలు!