డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు నటుడు నవదీప్ హాజరుకానున్నాడు. ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ ను కూడా ఈడీ విచారించే అవకాశం ఉంది. మొదట్లో ఈ కేసు డ్రగ్ సరఫరాదారుడు కెల్విన్ చుట్టూ తిరిగినా, విచారణ క్రమంలో ఎఫ్-క్లబ్‌లో పార్టీలపైనా, ఆ పార్టీల్లో పాల్గొన్నవారి ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ అధికారులు దృష్టి సారిస్తూ వచ్చారు. దీంతో సోమవారం నాటి విచారణకు హీరో నవదీప్, ఎఫ్-క్లబ్ మేనేజర్ హాజరుకానుండటం ఆసక్తికరంగా మారింది.ఇప్పటి వరకు తెలుగు సినీ ప్రముఖులను ఉక్కిరిబిక్కిరి చేసిన డ్రగ్స్ కేసుకు తోడు తాజాగా మనీ లాండరింగ్ కోణంలో విచారణ సాగుతుండండం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే పూరి జగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి, రవితేజ, రానా లను ఈడీ ప్రశ్నించింది. ఒక్కొక్కరిని ఏడెనిమిది గంటల పాటు విచారించిన ఈడీ మనీల్యాండరింగ్ వ్యవహారాలపై ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో కెల్విన్ తో లావాదేవీలపైనా ఆరాలు తీసింది. నవదీప్ కూడా ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ లావాదేవీలను ఈడీకి వెల్లడించాల్సి ఉంటుంది.
Also Read: ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందంటే..
2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 30 మందికి పైగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అందులో కీలకంగా కెల్విన్, వహీద్, ఖుద్దూస్, జీషాన్ లను గతంలోనే విచారించి వారి బ్యాంక్ ఖాతాలను ఈడీ పరిశీలించింది. వీరి బ్యాంక్ అకౌంట్స్ నుంచి విదేశాలకు భారీగా డబ్బు వెళ్లినట్లు ఈడీ అధికారులకు ఆధారాలు లభించాయి. అంతేకాదు.. సినీ తారల బ్యాన్ అకౌంట్స్ నుండి కెల్విన్, ఖుధూస్, వహీద్, జీషాన్ ల అకౌంట్స్ మధ్య లావాదేవీలు జరిగినట్లు కూడా తేలింది. కెల్విన్ కాల్ డేటా.. అతని బ్యాంక్ స్టేట్మెంట్స్ ను బట్టి సెలబ్రిటీలకు నోటీసులు పంపించింది ఈడీ. అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరైన సెలబ్రిటీల నుంచి పూర్తి వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తోంది ఈడీ. నవదీప్, ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్ చెప్పే విషయాలతో ఈ కేసులో ఇంకేమైనా కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయో లేదో చూడాలి. ఈ కేసులో ఈ నెల 15న ముమైత్‌ఖాన్, 17న తనీశ్, 22న తరుణ్ ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
టాలీవుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్స్ విచారణపై స్పందించిన సీనియర్ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేవసం సినిమా వాళ్లే కాదు ఇందులో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారన్నారు. ఇది తగ్గాలంటే భారతదేశంలో కఠిన చట్టాలను తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సింగపూర్ మలేషియా సహా అన్నిచోట్లా డ్రగ్స్ ఉన్నప్పటికీ అక్కడ కఠిన చట్టాలతో కంట్రోల్ చేస్తున్నారు కానీ మనదేశంలో అది లేదన్నారు. ఇక్కడ కూడా కఠిన చట్టాలు అమలైతే డ్రగ్స్ తో పాటు లైంగిక దాడులు కూడా ఆగిపోతాయన్నారు.
Also Read: స్వల్పంగా తగ్గిన బంగారం, తటస్థంగా వెండి ధరలు... తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవాళ్టి ధరలు ఇలా
Also Read: దళిత బంధుకు సన్నాహకం.. చారకొండలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న ప్రభుత్వం
Also Read: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు... తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇలా