ఆర్ఆర్ఆర్:

 

'బాహుబలి'తో టాలీవుడ్ రేంజ్ మార్చేసిన రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో మెగా-నందమూరి వారసులు నటిస్తుండడంతో క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది.  ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదిన విడుదల చేయబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఇటీవల దీపావళి సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' గ్లింప్స్ ను విడుదల చేసి అభిమానుల్లో జోష్ పెంచారు. అలానే ఒక్కో పాటను విడుదల చేస్తున్నారు. ఇక సినిమా ట్రైలర్ ను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో తెలుసా..? డిసెంబర్ 3. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఒకట్రెండు రోజుల్లో రాబోతుంది. 

 

పుష్ప: 

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పదేళ్ల తర్వాత వస్తున్న సినిమా 'పుష్ప'. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ రికార్డులను తిరగరాశాయి. ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. దీంతో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ రేపే రానుంది. 

 

భీమ్లానాయక్:  

 

పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాలో పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలను టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా.. డిసెంబర్ 14 లేదా 15 తేదీల్లో ట్రైలర్ రాబోతుంది. సినిమాను అనుకున్నట్లుగానే సంక్రాంతికే రిలీజ్ చేయబోతున్నారు. 

 

రాధేశ్యామ్: 

 

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్'. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది చిత్రయూనిట్. రీసెంట్ గా సినిమా టీజర్ విడుదల కాగా.. ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ రెండో వారం, లేదా మూడో వారంలో సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

 








ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి