Tollywood Latest Updates : మహేష్ డ్యాషింగ్ లుక్.. ఫహద్ ఫెరోషియస్ ఐస్.. 

ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన అప్డేట్స్ మీకోసం.. 

Continues below advertisement

మహేష్ బాబు న్యూ లుక్ : 

Continues below advertisement

రేపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇప్పటినుండే ఫ్యాన్స్ హడావిడి మొదలుపెట్టేశారు. రక్తదానం లాంటి సేవా కార్యక్రమములు షురూ చేశారు. ఇలా అభిమానులు మంచి హంగామాగా ఉన్న సందర్భంలో మహేష్.. అభిమానులకు ముందే ట్రీట్ ఇచ్చేశాడు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో మహేష్ ఫోటో ఒకటి విడుదలైంది. ఈ ఫోటోను మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. నాలుగు పదుల వయసు దాటేసినా ఇప్పటికీ మహేష్ అదే డ్యాషింగ్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. షర్ట్ బటన్ తీసేసి ఫార్మల్స్ వేసుకొని తీసుకున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 

ఫహద్ ఫాజిల్ ఫెరోషియస్ ఐస్ : 

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఆదివారం నాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్రను ప్రతిబింబించేలా ఓ క్యాప్షన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం.  'చెడు చూడటానికి ఎప్పుడూ ప్రమాదకరంగా కనిపించదు. హ్యాపీబర్త్‌డే ఫహద్‌ ఫాజిల్‌' అంటూ ఫహద్ కన్ను మాత్రమే పోస్టర్ పై కనిపించేలా డిజైన్ చేశారు. మరి ఈ సినిమాలో ఫహద్ పాత్ర ఎలా ఉండబోతుందో తెలియాలంటే డిసెంబర్ వరకు ఎదురుచూడాల్సిందే!

పాగల్ ఫస్ట్ వీడియో సాంగ్ : 

'ఫలక్ నుమా దాస్', 'హిట్' వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు సంపాదించుకున్న నటుడు విశ్వక్ సేన్ ఈసారి ప్రేమకథతో ప్రేక్షకులను అలరించనున్నాడు. అదే 'పాగల్'. నరేష్ కొప్పిలి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. తాజాగా సినిమాలో ఫస్ట్ సాంగ్ ను విడుదల చేసింది. 'గూగులు గూగులు గూగులు.. గర్ల్‌ఫ్రెండ్‌ని వెతికే గూగులు.. వీడు పాగలు పాగలు పాగలు.. ప్రేమ కోసం వెతికే పాగలు' అంటూ సాగే ఈ లిరికల్‌ సాంగ్ యూత్ ను ఆకట్టుకుంటుంది. దిల్‌ రాజు సమర్పణలో వేణుగోపాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 

Also Read : OTT Releases: బాలీవుడ్ టు హాలీవుడ్.. ఈ వారం ఓటీటీలో రిలీజ్ లు ఇవే..

Prabhas Treat to Shruti Haasan: 'సలార్' సెట్ లో ప్రభాస్ డిన్నర్ ట్రీట్.. ఫిదా అయిపోయిన శృతిహాసన్..

 

 

Continues below advertisement
Sponsored Links by Taboola