OTT Releases: బాలీవుడ్ టు హాలీవుడ్.. ఈ వారం ఓటీటీలో రిలీజ్ లు ఇవే..
What If...? : హాలీవుడ్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను డిస్నీ హాట్ స్టార్ లో ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు. జెఫ్రీ రైట్ నటిస్తోన్న ఈ సినిమాను బ్రయాన్ ఆండ్రూస్ డైరెక్ట్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppThe Brooklyn Nine-Nine : హాలీవుడ్ కి చెందిన ఈ వెబ్ సిరీస్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు కొత్త సీజన్ రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 12 నుండి ప్రసారం చేయనున్నారు.
షేర్షా : సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమాను విష్ణువర్ధన్ తెరకెక్కించారు. కార్గిల్ వార్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 12న విడుదల చేయనున్నారు.
భుజ్ : అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, నోరా ఫతేహి లాంటి స్టార్లు నటించిన ఈ సినిమాను హాట్ స్టార్ లో విడుదల చేయనున్నారు. ఆగస్టు 13 నుండి ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
EVANGELION:3.0+1.01 THRICE UPON A TIME : జపనీస్ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో నాల్గో చాప్టర్ ను ఆగస్టు 13న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు.
Modern Love : హాలీవుడ్ కు చెందిన ఈ ఆంథాలజీ ఫిలింలో కొత్త సీజన్ ఆగస్టు 13న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.