ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి:
ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శకనిర్మాత రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు(ఆగస్ట్‌ 19) తుదిశ్వాస విడిచారు. 'ఆ నలుగురు' సినిమాను డైరెక్ట్ చేసిన చంద్ర సిద్ధార్థ్‌కు ఈయన సోదరుడు. తెలుగులో 'నిరంతరం(1995)' అనే సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు పాటు నిర్మాతగా కూడా పని చేశారు. రాజేంద్ర ప్రసాద్‌ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. పుణెలోలో ఓ ప్రముఖ ఫిల్మ్‌ స్కూల్‌లో సినిమాటోగ్రఫీని నేర్చుకున్నాడు. ఇంగ్లీష్‌, పెర్షియన్‌ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారాయన. హాలీవుడ్‌లో 'మన్ విమన్ అండ్ ది మౌస్', 'రెస్డ్యూ - వేర్ ది ట్రూత్ లైస్', 'ఆల్ లైట్స్, నో స్టార్స్' సినిమాలకు దర్శకత్వం వహించారు. 


ఓటీటీలోకి 'షంషేరా':
రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'షంషేరా' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ తెరకెక్కించిన ఈ సినిమాకి కరణ్ మల్హోత్రా దర్శకుడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. మీడియాలో కూడా ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ రాలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. కనీసం ఓటీటీలోనైనా ఈ సినిమా వర్కవుట్ అవుతుందేమో చూడాలి!


బాలీవుడ్ లో 'కార్తికేయ2' హవా:


యంగ్ హీరో నిఖిల్ నటించిన 'కార్తికేయ2' సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ సినిమా ఫైనల్ గా ఆగస్టు 13న విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అదే రేంజ్ లో కలెక్షన్స్ ను కూడా సాధిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సత్తా చాటుతోంది. సినీ ప్రేక్షకులతో పాటు.. సెలబ్రిటీలు కూడా 'కార్తికేయ2' సక్సెస్ పై స్పందిస్తున్నారు. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన కార్తికేయ 2 బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. హిందీలో తొలిరోజు కేవలం 50 థియేటర్స్‌లో ఈ సినిమాను విడుదల చేస్తే.. ఇప్పుడు మొత్తం 1000 స్క్రీన్స్ లో ఈ సినిమా విజయవంతంగా ఆడుతోంది. దాన్ని బట్టి సినిమా క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. 


Also Read: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!


Also Read: 'లైగర్'కి సీక్వెల్ - అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ