ప్రముఖ యాంకర్, నటి అనసూయ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతోంది. కొన్నిరోజుల క్రితం 'దర్జా' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. కానీ ఈ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో 'పుష్ప2' లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు ఒప్పుకుంటుంది. ఓ పక్క బుల్లితెరపై షోలను హోస్ట్ చేస్తూనే.. మరోపక్క వరుస సినిమాలు కూడా ఒప్పుకుంటుంది. 


ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ పెట్టిన ట్వీట్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అనసూయను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం ట్వీట్ చేసిందంటే.. ఇటీవల గుజరాత్ కి చెందిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచార కేసులో జైలు నుంచి దోషులు విడుదలైన సంగతి తెలిసిందే. వారికి ఓ సంస్థ సన్మానం కూడా చేసింది. దీంతో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఈ ట్వీట్ ను అనసూయ రీట్వీట్ చేస్తూ.. 'దారుణం.. మనం స్వేచ్ఛకు కొత్త అర్ధం వచ్చేలా చేస్తున్నట్లనిపిస్తుంది. రేపిస్ట్ లను విడిచిపెట్టి.. మహిళలను ఇంటికే పరిమితం చేసేలా ఉన్నాం' అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు అనసూయను టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మైనర్ పై అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని ఆమెని ప్రశ్నిస్తున్నారు. 


దీంతో అనసూయ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తన మాటలను రాజకీయం చేయొద్దంటూ ట్వీట్ చేసింది. తాను ఏ ట్వీట్ చేసినా.. అది సొంత ఇంట్రెస్ట్ మాత్రమేనని చెప్పింది. ఎవరినో ప్రమోట్ చేయడానికో, డబ్బుల కోసం ట్వీట్స్ చేయడం లేదని తెలిపింది. ఏం జరిగిందో తెలుసుకునే మాట్లాడతానని చెప్పింది. తాను ఏం మాట్లాడుతున్నా.. తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని వాపోయింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. 


Also Read : 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - ఆ బూతు డైలాగ్స్ కట్!



Also Read : 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - సినిమాలో పాటలు ఎన్ని? ఫైట్లు ఎన్ని?