టాలీవుడ్ లో రొటీన్ భిన్నంగా సినిమాలు చేసే దర్శకుల్లో చందూ మొండేటి(Chandoo Mondeti) ఒకటి. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. 2014లో 'కార్తికేయ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని.. దర్శకుడిగా తన సత్తా చాటారు. ఆ తరువాత నాగచైతన్యతో 'ప్రేమమ్', 'సవ్యసాచి' వంటి సినిమాలను రూపొందించారు. నివేదా పేతురేజ్ ప్రధాన పాత్రలో 'బ్లడీ మేరీ' సినిమాను తెరకెక్కించారు. అది నేరుగా ఓటీటీలో విడుదలైంది. 


తాజాగా 'కార్తికేయ2'(Karthikeya2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చందు మొండేటి. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నిజానికి 'కార్తికేయ2' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉంది. ఫైనల్ గా ఆగస్టు 13న స్లాట్ దొరకడంతో సినిమా రిలీజ్ అయింది. ఆలస్యంగా విడుదలైనప్పటికీ భారీ విజయాన్ని అందుకుంది. 


సినిమాను కొన్న బయ్యర్లంతా లాభాలు గడిస్తున్నారు. నార్త్ లో కూడా ఈ సినిమాకి భారీ వసూళ్లు వస్తున్నాయి. అందుకే తెలుగుతో పాటు నార్త్ లో కూడా ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తుంది 'కార్తికేయ2' టీమ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చందు మొండేటి. ఈ సందర్భంగా తను డైరెక్ట్ చేసిన ఓ సినిమా ఫ్లాప్ అవుతుందని.. ఐదు రోజుల ముందే తనకు అర్థమైందని చెప్పుకొచ్చారు. 


నాగ చైతన్య హీరోగా చందు మొండేటి 'సవ్యసాచి' అనే సినిమాను రూపొందించారు. అంతకముందు చైతుకి 'ప్రేమమ్' లాంటి హిట్ ఇవ్వడంతో 'సవ్యసాచి' సినిమా చేయడానికి ఒప్పుకున్నారు చైతు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. చైతు ఎంతో నమ్మి సినిమా ఛాన్స్ ఇస్తే ఎందుకు సక్సెస్ చేయలేకపోయారని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. దానికి చందు మొండేటి.. 'సవ్యసాచి' సినిమా విషయంలో డిసప్పాయింట్మెంట్ అనిపించిందని.. దర్శకుడిగా చాలా బాధేసిందని చెప్పారు. 


సినిమా రిలీజ్ కు ఐదు రోజుల ముందే తనకు రిజల్ట్ అర్థమైందని.. తను అనుకున్న మార్క్ లో సినిమా లేదని.. అయితే రిలీజ్ తరువాత ఏదైనా మ్యాజిక్ జరిగి పెద్ద హిట్ అయితే బాగుండనిపించిందని చెప్పుకొచ్చారు. 'సవ్యసాచి' విషయంలో రిజల్ట్ అలా రావడానికి కారణం.. స్క్రిప్ట్ లెవెల్ లో కన్ఫ్యూజ్ అయ్యాయని.. అక్కడే తప్పు జరిగిందని చెప్పుకొచ్చారు. సినిమా ఫెయిల్ అయినప్పుడు దాన్ని అంగీకరించాలని.. తను కూడా అదే చేశానని తెలిపారు. 


తన తదుపరి సినిమా గురించి మాట్లాడుతూ.. గీతాఆర్ట్స్ 2లో ఓ లవ్ స్టోరీ చేయబోతున్నట్లు చెప్పారు. అలానే 'కార్తికేయ2' సినిమాకి కొనసాగింపుగా 'కార్తికేయ3' కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమా ఎప్పుడు చేస్తామననేది ఇప్పట్లో చెప్పలేమని తెలిపారు.  


Also Read : 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - ఆ బూతు డైలాగ్స్ కట్!



Also Read : 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - సినిమాలో పాటలు ఎన్ని? ఫైట్లు ఎన్ని?