యంగ్ సెన్సేషనల్ హీరో, రౌడీ బాయ్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్. 'లైగర్' (Liger Movie) మూవీ సెన్సార్ కంప్లీట్ అయ్యింది. ఆగస్టు 25న తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. విడుదలకు మూడు వారాల ముందు సెన్సార్ కంప్లీట్ కావడంతో లాస్ట్ మినిట్ టెన్షన్స్ ఏమీ ఉండవని చెప్పాలి. సినిమాకు 'యు / ఎ' సర్టిఫికెట్ లభించింది.


సెన్సార్ రిపోర్ట్ ఏంటి?
'లైగర్' సినిమా నిడివి రెండు గంటల ఇరవై నిమిషాలు (Liger Movie Run Time). ఫస్ట్ హాఫ్ 75 నిమిషాలు (ఒక గంట 15 నిమిషాలు) ఉంటే... సెకండ్ హాఫ్ ఒక గంట ఐదు నిమిషాలు మాత్రమే. సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమాలు స్పీడుగా ముందుకు వెళతాయి. కథనాన్ని పరుగులు పెట్టిస్తారు. 'లైగర్' సినిమా సైతం పూరి సినిమాల తరహాలో పరుగులు పెడుతుందనేది సెన్సార్ రిపోర్ట్.
 
సినిమాలో పాటలు ఎన్ని? ఫైట్లు ఎన్ని?
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ నేపథ్యంలో 'లైగర్' తెరకెక్కింది. సినిమాలో ఫైట్స్ బావున్నాయని టాక్ వచ్చింది. మొత్తం ఏడు ఫైట్లు ఉన్నాయట. ఆరు పాటలు ఉన్నాయట. సాంగ్ పిక్చరైజేషన్‌లో పూరి జగన్నాథ్‌ది స్పెషల్ స్టైల్. ఆల్రెడీ విడుదలైన 'లైగర్' సాంగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మిగతా పాటలు కూడా బావుంటాయని సమాచారం.


ఆగస్టు 6న 'AAFAT' song విడుదల
ఆగస్టు 6న... శనివారం ఉదయం తొమ్మిది గంటలకు 'ఆ ఫట్' సాంగ్ విడుదల కానుంది. ఆల్రెడీ ఈ సినిమాలో 'అకిడి పకిడి...', 'వాట్ లాగా దెంగే...' సాంగ్స్ విడుదల అయ్యాయి. తొలి పాటను లిజో జార్జ్, డీజే చేతాస్ కంపోజ్ చేయగా... అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా ఆలపించారు. రెండో పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు. పూరి జగన్నాథ్ లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్ దేవరకొండ పాడటం విశేషం.


Also Read : ‘బింబిసార’ రివ్యూ: మద గజ మహా చక్రవర్తిగా నందమూరి కళ్యాణ్ రామ్ మెప్పించారా? లేదా?


విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే (Ananya Panday) కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.


ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల నిమిత్తం విజయ్ దేవరకొండ ముంబైలో ఉన్నారు. ఉత్తరాదిలో సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది. విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ బజ్ తీసుకు వస్తోంది. 


Also Read : రామ్ చరణ్ సినిమా పక్కనపెట్టి 'భారతీయుడు 2' రీ స్టార్ట్ చేయడం వెనుక అసలు కారణం ఇదే!