'అఖండ' బెనిఫిట్ షో..


నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'అఖండ'. బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను చేస్తున్న సినిమా కావడంతో 'అఖండ'పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ట్రైలర్, పాటలను విడుదల చేశారు. మాసివ్ ట్రైలర్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా బెనిఫిట్ షోల ప్రదర్శనకు నగరంలోని రెండు థియేటర్లను తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూకట్‌పల్లిలోని మల్లికార్జున, భ్రమరాంబ థియేటర్లకు బెనిఫిట్‌ ప్రదర్శించుకునే అవకాశం రావడంతో ఫ్యాన్స్ హడావిడి మాములుగా లేదు. ఉదయం 4: 30 ని.లకు సినిమా బెనిఫిట్ షో పడనుంది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. వీళ్లిద్దరి కలయికలో తొలి చిత్రమిది. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.






టికెట్ రేట్లు పెంచుకోమన్న హైకోర్టు.. 


సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి థియేటర్లకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. టికెట్ రేట్లపై అధికారులు తుది నిర్ణయం తీసుకునేవరకు యాజమాన్యాలు కోరిన ధరలతోనే థియేటర్లను నిర్వహించేందుకు అనుమతివ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 'అఖండ', 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప', 'భీమ్లానాయక్' వంటి భారీ బడ్జెట్ సినిమాలను ఒక్కో టికెట్ పై కనీసం రూ.50 పెంచాలని థియేటర్ల యాజమాన్యాలు భావిస్తున్నాయి. తమకు అనుమతివ్వాలని నవంబర్ చివరివారంలో మల్టీప్లెక్స్‌లు సహా సుమారు వందకు పైగా థియేటర్ల యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి యాజమాన్యాలు. దీంతో హైకోర్టు థియేటర్ల అభ్యర్ధనను అంగీకరిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.   


Also Read:'పావుగంటకొక పెక్.. రాత్రికొక పెగ్'.. బ్రహ్మానందంతో బాలయ్య అల్లరి..


Also Read: 'ఫోకస్' టాస్క్ ఫన్నీ టాస్క్ గా మారిపోయిందే..



 


 

Also Read: థియేటర్లు దొరక్క... పదిహేను రోజులు వెనక్కి వెళ్లిన పూర్ణ సినిమా

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి