మిళ నటుడు అజిత్ కు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉంది. ఈ ఏడాది ‘వలిమై’తో హిట్అం దుకున్న అజిత్‌ అదే జోష్‌ తో ‘తునివు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమౌవుతున్నాడు. ఈ మూవీను తెలుగులో ‘తెగింపు’ అనే టైటిల్ తో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి సందర్బంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీ పై తెలగు ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌ లకు విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. అయితే ఇటీవల ఈ సినిమా ప్రచార విషయంలో ఓ వినూత్న ప్రదర్శనను చేసింది చిత్ర బృందం. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.


సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అంటే రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు మేకర్స్. అయితే అజిత్ నటించిన ‘తునివు’ మూవీ టీమ్ మాత్రం సరికొత్త రీతిలో ప్రచారాన్ని మొదలుపెట్టింది. సినిమాకు సంబంధించిన భారీ పోస్టర్ ను గాలిలో ఎగరేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. స్కై డైవింగ్ ద్వారా చేసిన ఈ వినూత్న ప్రచారాన్ని వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది మూవీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్. అంతేకాదు ఈ మూవీకి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ ను కూడా ఇలాగే స్కై డైవింగ్ ద్వారా డిసెంబర్ 31న అనౌన్స్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.


అజిత్ సినిమాను ఇంత వీర లెవల్ లో ప్రచారం చేయడం వెనుక ఓ కారణం ఉంది. తమిళనాట ఎప్పటి నుంచో అజిత్, విజయ్ సినిమాల మధ్య సహజమైన పోటీ ఉంటుంది. ఈ యేడాది కూడా అజిత్ ‘తునివు’, విజయ్ ‘వారిసు’ సినిమాలు ఒకేసారి విడుదల అవ్వబోతున్నాయి. ఇటు తెలుగులో కూడా మార్కెట్ ను పెంచుకునే పనిలో ఉన్నారు ఈ ఇద్దరు హీరోలు. దీంతో ఈ రెండు సినిమాలు పోటా పోటీగా ప్రమోషన్స్ ను సాగిస్తున్నాయి. ఓ పక్క  ‘వారిసు’ అప్డేట్ లు మరో పక్క ‘తునివు’ అప్డేట్ లతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మొదటి నుంచీ ఈ రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్, పాటలు ఇలా అన్నింటిలోనూ పోటా పోటీగా అప్డేట్ లను రివీల్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ‘తునివు’ టీమ్ స్కై డైవింగ్ ద్వారా ప్రచారం చేయండం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి. లైకా ప్రోడక్షన్ సంస్థ గతంలోనూ ఓ సినిమా ప్రచార విషయంలో ఇలాంటి వినూత్న ప్రచారం చేయడం గమనార్హం. మరి ఈ తమిళ డబ్బింగ్ సినిమాలు ఈసారి సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.


Also Read : మాస్ సినిమా చేస్తే 'కెజియఫ్' లాంటి సినిమా చేస్తా - ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ