Stock Market @ 12 PM, 28 December 2022: 


భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 11 పాయింట్ల లాభంతో 18,144 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 60 పాయింట్ల లాభంతో 60,988 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 60,927 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,811 వద్ద మొదలైంది. 60,713 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,011 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 60 పాయింట్ల లాభంతో 60,988 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


మంగళవారం 18,132 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,084 వద్ద ఓపెనైంది. 18,068 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,151 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 11 పాయింట్ల లాభంతో 18,144 వద్ద చలిస్తోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ఉంది. ఉదయం 42,733 వద్ద మొదలైంది. 42,694 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,694 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 141 పాయింట్లు ఎగిసి 43,000 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ఉన్నాయి. టైటాన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, గ్రాసిమ్‌, మారుతీ, ఎం అండ్‌ ఎం షేర్లు లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, దివిస్‌ ల్యాబ్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు స్వల్పంగా పతనమయ్యాయి. ఆటో, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.