కొన్ని రోజుల క్రితం సీనియర్ తెలుగు నటుడు నరేష్, కన్నడ నటి పవిత్రా లోకేష్‌ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.ఆ తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకోరని, సహజీవనం చేస్తున్నారంటూ గుసగుసలు వినిపించాయి. కన్నడ మీడియా చేసిన ఓ స్టింగ్ ఆపరేషన్లో పవిత్రా కూడా నరేష్ తో సహజీవనం చేస్తున్నట్టు ఒప్పుకుంది. దీంతో వీరిద్దరి వ్యవహారం రెండు రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా వీరిద్దరినీ ఓ హాటల్ గదిలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పట్టుకున్న వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. పవిత్ర - నరేష్ ఒకే హోటల్ గదిలో ఉన్న సమాచారం రమ్యకు తెలిసిందని, దీంతో ఆమె నేరుగా అక్కడికి వచ్చినట్టు సమాచారం. చెప్పుతో వారిద్దరినీ కొట్టేందుకు సిద్ధమైంది.అయితే, మధ్యలో పోలీసులు వచ్చి ఆమెను అడ్డుకున్నారు. దీంతో రమ్య ఆగ్రహంతో ఊగిపోయినట్టు వీడియోలో కనిపిస్తోంది. ‘అక్రమ సంబంధాలను మీరు ప్రోత్సహిస్తారా’ అంటూ పోలీసులను నిలదీసింది రమ్య. హోటల్ గదిలోంచి బయటికి వచ్చిన నరేష్, పవిత్ర నేరుగా లిఫ్ట్‌లోకి వెళ్లిపోయారు. నరేష్ విజిల్స్ వేస్తూ రమ్యను మరింత రెచ్చగొడుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అంతేకాదు కాదు ఆమె ఒక ఫ్రాడ్, చీటర్ అంటూ గట్టిగా అరిచాడు. ఇదంతా కన్నడ టీవీ ఛానెళ్లలో ప్రసారమైంది. మైసూర్‌లోని హున్‌సూర్‌ రోడ్డులోని కోరమ్‌ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


భర్త ఆరోపణలు
పవిత్రా లోకేష్ భర్తగా చెప్పుకుంటున్న సుచేంద్ర ప్రసాద్ కూడా ఆమె కాపురాలు కూల్చే వ్యక్తంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు. కొన్నేళ్లుగా సహజీవనంలోనే ఉంటున్నారు. వీరద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పవిత్ర తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో స్టార్ హీరో హీరోయిన్లకు తల్లిగా నటిస్తుంది. నరేష్ కూడా ప్రస్తుతం హీరోలకు, హీరోయిన్లకు తండ్రి పాత్రలు చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 


కన్నడ మీడియా చేసిన స్టింగ్ ఆపరేషన్లో పవిత్రా తాను నరేష్ తో కలిసి ఉంటున్నానని, అతని ఫ్యామిలీకి కూడా నేను సమ్మతమేనని చెప్పింది. నరేష్ తోడుగా ఉంటున్నట్టు తెలిపింది. మూడో భార్య రమ్య గురించి కూడా మాట్లాడింది. రమ్య సరిగా ఉండకపోవడం వల్లే సమస్యలని కామెంట్ చేసింది. 



Also read: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్