టాలీవుడ్ లో హీరోగా కెరీర్ మొదలుపెట్టి.. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు నటుడు నరేష్. కృష్ణ ఫ్యామిలీకి చెందిన ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన నటి పవిత్రా లోకేష్ తో రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అందులో నిజం లేదని మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమేనని చెబుతున్నారు నరేష్.
ఇటీవల ఓ కన్నడ ఛానెల్ పవిత్రా లోకేష్, నరేష్ రిలేషన్ పై స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది. అందులో పవిత్రా.. నరేష్ తో సహజీవనం చేస్తున్నట్లు చెప్పడం వైరల్ అయింది. ఈ వీడియోను సదరు ఛానెల్ పదే పదే టెలికాస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ అయిన తరువాత పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసింది. తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవిడ ఫిర్యాదులో పేర్కొంది.
తాజాగా నటుడు నరేష్ కన్నడలో ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇందులో ఆయన తన మూడో భార్య రమ్య రఘుపతి గురించి, అలానే పవిత్రా లోకేష్ తో తన రిలేషన్ గురించి మాట్లాడారు.
డబ్బు కోసం నన్ను వాడుకుంది..:
తన మూడో భార్య రమ్య రఘుపతి తనను డబ్బు కోసం వాడుకుందని చెప్పారు నరేష్. ఏరోజు కూడా ఆమె భార్యలా ప్రవర్తించలేదని.. ఆమె గురించి చెప్పడానికే సిగ్గుగా ఉందని అన్నారు. ఆమె దగ్గర పనిచేసే ముస్లిం డ్రైవర్ తో సెక్సువల్ అఫైర్ పెట్టుకుందని.. విషయం తెలిసి ప్రశ్నిస్తే చెత్త వివరణలు ఇస్తుందని అన్నారు. ఇంట్లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తే దానికి మేల్ క్యాబరే డాన్సర్స్ ను తీసుకొచ్చిందని.. అసహ్యించుకుంటూ చెప్పారు నరేష్. మొదట ఆమె నుంచి విడాకులు తీసుకోవాలనుకోలేదని.. కానీ పరిస్థితి చేయి దాటాక తప్పడం లేదని అన్నారు. ఇప్పుడు తన బిడ్డ కస్టడీ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
పవిత్రా లోకేష్ మంచి స్నేహితురాలు..:
పవిత్రా లోకేష్ తో తన రిలేషన్ గురించి మాట్లాడుతూ ఆమె తనకు మంచి స్నేహితురాలని చెప్పారు నరేష్. ఆమెతో కలిసి నాలుగైదు సినిమాలు చేశానని అన్నారు. ఆమెపై స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన మీడియాపై మండిపడ్డారు నరేష్. జనాలకు అన్యాయం జరుగుతున్న విషయాలపై స్ట్రింగ్ ఆపరేషన్ చేయాలని.. అంతేకానీ ఒకరి పెర్సనల్ లైఫ్ మీద చేయడం తప్పని అన్నారు. పవిత్రా లోకేష్ పై తనకు అభిమానం, గౌరవం ఉన్నాయని నరేష్ అన్నారు. తను డిప్రెషన్ తో బాధపడుతున్న సమయంలో పవిత్రా సపోర్ట్ గా నిలిచిందని.. అలాంటి సమయంలో ఒక ఫ్రెండ్ అవసరం ఉందని.. పవిత్రా తనకు మంచి ఫ్రెండ్ అని అన్నారు. తనకు చాలా మంది స్నేహితులు, ఆత్మీయులు ఉన్నారని.. అందులో పవిత్రా ఒకరని చెప్పారు. కృష్ణ ఫ్యామిలీ కూడా తనకు రెస్పెక్ట్ ఇస్తుందని అన్నారు.
Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?