Charminar Bhagyalakshmi Temple: తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు జాతీయ స్థాయి కాషాయపార్టీ నేతలు హైదరాబాద్‌కు వచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలు, కేంద్ర మంత్రుల, ఇతర కీలక నేతలు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ కూడా నగరానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.


గతంలో మొక్కు ఉన్నందుకు సీఎం యోగీ అమ్మవారి ఆలయానికి వచ్చారని బీజేపీ నేతలు వెల్లడించారు. సీఎంతో యోగితో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌, పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలయానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు చార్మినార్ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరిని తనిఖీలు చేసి పంపిస్తున్నారు.






 సీఎంతో యోగితో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌, పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలయానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు చార్మినార్ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరిని తనిఖీలు చేసి పంపిస్తున్నారు.


రెండ్రోజుల నుంచి ప్రముఖులు
గత రెండు రోజులుగా భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తున్నవారిలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, డిప్యూటీ సీఎం తారా కిషోర్ ప్రసాద్, జగద్గురు స్వామి రాఘవా చార్య మహారాజ్, ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన, డౌరహా పార్లమెంట్ సభ్యురాలు రేణుకా వర్మ, అసోంకు చెందిన మంగలదోయ్ ఎంపీ దిలీప్ సైకియా, గువహటికి నార్త్, ఈస్ట్ స్టేట్ బీజేపీ జనరల్ సెక్రటరీ అజయ్ జామ్ వాల్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.


జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచే
2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం రాజకీయాల్లో భాగం అయిపోయిన సంగతి తెలిసిందే. ఆ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరూ ఊహించనట్లుగా బీజేపీ 44 స్థానాలను సాధించింది. అప్పటి నుంచి ఏకంగా జాతీయ స్థాయి బీజేపీ నేతలు కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు. గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నవారిలో ఉన్నారు.