సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో చాలా కాలంగా ల్యాబ్ లో ఉండిపోయిన సినిమాలు ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ఓటీటీ నుంచి వెండితెరకు పొంచి ఉన్న ప్రమాదం మాత్రం తప్పడం లేదు. భారీ-మీడియం రేంజ్ సినిమాలను కూడా థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సాహసం చేయడం లేదు. సినిమాలు రిలీజ్ అవుతున్నా.. వసూళ్లు రాబట్టలేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇప్పటికీ భయపడుతూనే ఉన్నారని ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల వసూళ్లు నిరూపించాయి. అందుకే నిర్మాతలు థియేటర్లలో సినిమాలను విడుదల చేయడం రిస్క్ అని భావిస్తున్నారు. 'టక్ జగదీష్' లాంటి పేరున్న సినిమా ఓటీటీకి వెళ్లడానికికారణమిదే. ఈ వారమే 'టక్ జగదీష్' సినిమా ఓటీటీలో విడుదల కానుంది. అయితే అదే రోజున థియేటర్లలో 'సీటీమార్' సినిమా సందడి చేయబోతుంది.
Also Read : Ram Charan: రామ్ చరణ్, శంకర్ మూవీ అదిరిపోయే అప్‌డేట్.. షూటింగ్ డేట్, హీరోయిన్ కూడా ఫిక్స్!
ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోయే పెద్ద సినిమాలివే. ఒక రకంగా చెప్పాలంటే థియేటర్ వర్సెస్ ఓటీటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాని 'టక్ జగదీష్' సినిమా ఈ నెల 10న అమెజాన్ లో విడుదల కానుంది. నానికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఎగబడి చూస్తుంటారు. 'టక్ జగదీష్' సినిమా ఫ్యామిలీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్. నిజానికి ఇది థియేటర్లలో విడుదల కావాల్సిన సినిమా.
కానీ పరిస్థితులు బాగాలేకపోవడంతో ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది. వినాయకచవితికి ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. అదే రోజున గోపీచంద్ నటించిన 'సీటీమార్' సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. సంపత్ నంది డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. కబడ్డీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇప్పటివరకు విడుదలైన సినిమా పాటలు, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి గనుక మంచి ఓపెనింగ్స్ వస్తే మరిన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయడం ఖాయం.
ALso Read: ‘బిగ్ బాస్ 5’ అరుదైన రికార్డ్.. దేశంలో 2 స్థానంలో తెలుగు రియాల్టీ షో
బిగ్ బాస్ హౌస్‌లో 19 మంది కంటెస్టెంట్లు.. సరయు తిట్లకు నాగ్ ఫిదా!