మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ వరుస హిట్లతో దూసుకుపోతోంది. సంవత్సర కాలంలో నాలుగు సినిమాల్లో నటించిగా, అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది సంయుక్త.  తొలి చిత్రంతోనే అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ తో కలిసి ‘బింబిసార’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా చక్కటి విజయాన్ని అందుకుంది. అనంతరం ధనుష్ హీరోగా వచ్చిన ‘సార్’ మూవీతో మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఇక రీసెంట్ గా మెగా హీరో సాయి ధరమ్ తేజ్  నటించిన ‘విరూపాక్ష’తో సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. వరుసగా ఆమె నటించిన నాలుగు చిత్రాలు విజయం సాధించడంతో  ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.   

‘డెవిల్‘ నుంచి సంయుక్త ఫస్ట్ లుక్ రిలీజ్

ఇక వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ తో కలిసి తాజాగా సంయుక్త మీనన్ ఓ సినిమా చేస్తోంది. పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ గా ‘డెవిల్’ అనే చిత్రం రూపొందుతోంది. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్ ఇచ్చారు మేకర్స్. ఇవాళ (సెప్టెంబ‌ర్ 11) సంయుక్త మీనన్ తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఆమెకు అదిరిపోయే గిఫ్ట్ అందించింది. ఈ చిత్రంలో సంయుక్త పోషించిన నైష‌ధ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.  

ఆకట్టుకుంటున్న నైష‌ధ ఫ‌స్ట్ లుక్

‘డెవిల్’ చిత్రంలో సంయుక్త ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది. కొబ్బ‌రికాయ‌, పువ్వులు  తీసుకుని గుడిలో పూజకు వెళుతున్న అమ్మాయిగా ప్లెజంట్‌ లుక్‌లో ఆకట్టుకుంటోంది. సంయుక్త పదహారణాల తెలుగమ్మాయిలా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చుట్టూ ఆలయాలు, పక్కనే ఎగురుతున్న పావురాలు మరింత అందంగా అందాన్ని తీసుకొచ్చాయి.  

న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

‘డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్  ఆక‌ట్టుకోబోతున్నారు. గ‌త ఏడాది తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ‘బింబిసార’తో మెప్పించిన కళ్యాణ్ రామ్ ‘డెవిల్’తో ప్రేక్షకులను అలరించేందుకు  రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ‘డెవిల్’ సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. దేవాన్ష్ నామా స‌మ‌ర్ప‌కుడిగా.. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.  శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

Read Also: చెన్నైలో రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు, కారణం ఏంటో తెలుసా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.Join Us on Telegram: https://t.me/abpdesamofficial