Stock Market Today, 11 September 2023: నిఫ్టీ 50, శుక్రవారం, 19,800 మార్క్‌ పైన ముగిసింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ సంకేతాలు బలహీనంగా ఉన్నాయి. ఇవాళ ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 21 పాయింట్లు లేదా 0.11 శాతం రెడ్‌ కలర్‌లో 19,918 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని ప్రమోటర్ గ్రూప్, క్లా బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం, గ్రూప్ లిస్టెడ్ కంపెనీలైన అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్‌లో వాటాను పెంచుకుంది.


IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెలవలప్స్‌: IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్‌, IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్, ఆగస్టు నెలలో టోల్ గేట్ల ఆదాయాన్ని రూ. 417 కోట్లుగా ప్రకటించింది. ఇది, గత సంవత్సరం ఇదే కాలం కంటే 24% (YoY) వృద్ధి.


SJVN: ఈ కంపెనీ, తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన SJVN గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (SGEL) ద్వారా, 18 మెగావాట్ల సోలార్ పవర్ కోసం భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్‌తో (BBMB) PPAపై సంతకం చేసింది.


కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్: ఇన్‌సాల్వెన్సీ & బ్యాంక్‌రప్‌ట్సీ కోడ్ కింద కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు వ్యతిరేకంగా దరఖాస్తు దాఖలైంది. దీనిపై న్యాయ సలహాలు తీసుకుంటున్నామని, కంపెనీ ప్రయోజనాలను రక్షించుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ ప్రకటించింది.


ఇన్‌సెక్టిసైడ్స్‌: ఈ కంపెనీకి చెందిన, దహేజ్‌లోని ఒక ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం వల్ల జరిగిన అసలు నష్టాన్ని కంపెనీ అంచనా వేస్తోంది.


ఎథోస్: దిల్లీ వ్యాట్ (VAT) విషయంలో తనకు అనుకూలమైన ఫలితాన్ని ఎథోస్ సాధించింది. కంపెనీ చెల్లించాల్సిన రూ.33.76 కోట్ల మొత్తం కాంపీటెంట్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వుల వల్ల రద్దయింది. ఆ మొత్తం ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు.


సైమెన్స్: FY09, FY10 (గత సైమెన్స్ హెల్త్‌కేర్ డయాగ్నోస్టిక్స్‌కు వ్యతిరేకంగా, కంపెనీలో విలీనమైనప్పటి నుంచి), FY15, FY16 ఆర్థిక సంవత్సరాలకు ఆదాయపు పన్ను అధికారి అసెస్‌మెంట్ ఆర్డర్‌ను ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ రద్దు చేసింది. దీంతో, సైమెన్స్ చెల్లించాల్సిన మొత్తం రూ. 106.5 కోట్లు తగ్గింది.


IRCTC: ఇండియన్‌ రైల్వేస్‌ క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC), ఫుల్‌ టారిఫ్‌లతో బుక్ చేసుకున్న అన్ని రైళ్లలో క్యాటరింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది.


నాట్కో ఫార్మా: ఈ ఫార్మా కంపెనీ, అమెరికాలో ఒక కేసులో ఇరుక్కుంది. లూసియానా హెల్త్ సర్వీస్ అండ్ ఇండెమ్నిటీ కంపెనీ బ్లూ క్రాస్, బ్లూ షీల్డ్ ఆఫ్ లోసిసియానా అండ్‌ HMO లూసియానా ఇంక్‌ ఈ కేసు వేశాయి. పోమాలిడోమైడ్‌కు సంబంధించి USలో యాంటీట్రస్ట్ దావాలో ఇతర కంపెనీలతో పాటు నాట్కో ఫార్మాను కూడా ప్రతివాదిగా ఆ కంపెనీ చేర్చింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ఇది కూడా చదవండి: గోల్డెన్‌ ఛాన్స్‌ - బంగారం కొంటే తరుగు లేదు, జీఎస్టీ ఉండదు, పైగా ఎదురు వడ్డీ చెల్లిస్తారు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial