గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), సంగీత దర్శకుడు తమన్ (Thaman) ది హిట్ కాంబినేషన్. అందులోనూ 'అఖండ' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా. అందువల్ల, మ్యూజిక్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం మీద! తమన్ కూడా ఆ అంచనాలు మరింత పెంచేస్తున్నారు. 


కంప్లైంట్స్ చేయొద్దు...
ప్రిపేర్ అయ్యి రండి!
'అఖండ' విజయంలో నేపథ్య సంగీతం ముఖ్య భూమిక పోషించింది. థియేటర్లలో జనాలను ఒక ట్రాన్స్‌లోకి తీసుకు వెళ్ళింది. అయితే, అమెరికాలో కొంత మంది సౌండ్ ఎక్కువైందని కంప్లైంట్స్ చేశారు. బహుశా... ఆ విషయం తమన్ మనసులో బలంగా ఉందనుకుంట!


''కలుద్దాం... దుమ్ము లేపుదాం! జై బాలయ్య. ఈసారి థియేటర్స్... దయచేసి కంప్లైంట్స్ చేయకండి. ప్రిపేర్ అవ్వండి'' అని తమన్ ట్వీట్ చేశారు. అదీ సంగతి!


బాలయ్యకు భీభత్సమైన 
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్...!
'వీర సింహా రెడ్డి'కి కూడా తమన్ భీభత్సమైన బ్యాక్  గ్రౌండ్ స్కోర్ అందించారని ఇండస్ట్రీ వర్గాల టాక్. దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni), తమన్ కాంబినేషన్ కూడా హిట్టే. మలినేని లాస్ట్ సినిమా 'క్రాక్'కు కూడా సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.






చిత్రీకరణ పూర్తి!
సంక్రాంతి కానుకగా జనవరి 12న 'వీర సింహా రెడ్డి' సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఇందులోని తొలి పాట 'జై బాలయ్య'కు మంచి స్పందన లభించింది. రెండో పాట 'సుగుణ సుందరి'లో బాలకృష్ణ, శృతి హాసన్ మధ్య స్టెప్పులు అలరించాయి. మూడో సాంగ్ 'మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి' పాటలో నారి నారి నడుమ మురారి అన్నట్టు... ఇద్దరు హీరోయిన్లు హానీ రోజ్, చంద్రికా రవితో స్టెప్పులు వేశారు. ఇటీవల హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాస్ట్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. హీరో హీరోయిన్లు బాలకృష్ణ, శృతి హాసన్ మీద ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో చిత్రీకరణ చేశారు.


బాలకృష్ణకు దర్శకుడు గోపీచంద్ మలినేని వీరాభిమాని. లుక్స్ పరంగా మరింత కేర్ తీసుకుని, అభిమానులు కోరుకునే విధంగా చూపించారట. సాధారణంగా కమర్షియల్ సినిమాల రన్ టైమ్ రెండున్నర గంటల లోపు ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడతారు. అంత కంటే ఎక్కువ ఉన్న సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అందులో 'అఖండ' ఒకటి. ఆ సినిమా రన్ టైమ్ రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు. ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' రన్ టైమ్ కూడా అటు ఇటుగా అంతే ఉంటుందని సమాచారం.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.


Also Read : లిప్ కిస్సుతో గుడ్‌ న్యూస్ చెప్పిన నరేష్‌, పవిత్రా లోకేష్‌ - త్వరలో పెళ్ళి


హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.


Also Read : 'కోరమీను' రివ్యూ : మీసాలు తీయడమే కాదు, అంతకు మించి ట్విస్టులు ఉన్నాయ్ - ఆనంద్ రవి సినిమా ఎలా ఉందంటే?