Telugu Actor Jayadev Upcoming Movies Web Series: తెలుగు నటుడు జయదేవ్ పేరు ప్రస్తుతానికి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ, అతి త్వరలో అతను పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అగ్ర హీరోల సినిమాల్లో హీరో ఫ్రెండ్ రోల్స్, చిన్న చిన్న రోల్స్ చేసిన అతనికి ఇప్పుడో సినిమాలో పెద్ద పాత్ర చేసే అవకాశం వచ్చింది.


వరలక్ష్మీ శరత్ కుమార్ 'ఆద్య'లో విలన్
వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్ మహారాజా రవితేజ 'క్రాక్', సమంత 'యశోద' సినిమాల్లో డిఫరెంట్ విలన్ రోల్స్ చేశారామె. ఇప్పుడు ఆమెకు విలన్ రోల్ చేసే ఛాన్స్ జయదేవ్ సొంతం చేసుకున్నారు.


వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'ఆద్య' (Aadya Movie). అందులో జయదేవ్ విలన్ రోల్ చేస్తున్నారు. తనకు ఆ పాత్ర మంచి పేరు తీసుకు వస్తుందని అతను నమ్మకంగా ఉన్నారు. జయదేవ్ మాట్లాడుతూ ''వరలక్ష్మీ శరత్ కుమార్ గారితో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు కృష్ణ మామిడి గారికి థాంక్స్'' అని చెప్పారు. ఆ సినిమా కాకుండా 'వార్ మెన్' వెబ్ సిరీస్ కూడా అతను చేస్తున్నారు.


'ఆద్య' సినిమాకు ముందు జయదేవ్‌ ఏం చేశారు?
సంచలన దర్శకుడు తేజ నూతన నటీనటులతో ఓ సినిమా చేయాలని ఆ మధ్య ఆడిషన్స్ నిర్వహించారు. 'స్టార్ హంట్' ప్రోగ్రాం చేశారు. అందులో జయదేవ్ విజేతగా నిలిచారు. అప్పటికి అతని వయసు 17 సంవత్సరాలు. కొన్ని రోజులు వర్క్ షాప్స్ నిర్వహించారు. అయితే, అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. అయినా జయదేవ్ కుంగిపోలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా ఛాన్సులు కోసం ట్రై చేశారు. కొన్ని సినిమాలు అందుకున్నారు.


Also Readఫ్రెష్ బాబు ఫ్రెష్... సంక్రాంతి సినిమా ఏది చూసినా ఫ్రెష్ జోడీయే


రెబల్ స్టార్ ప్రభాస్ 'మిర్చి', యంగ్ & ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని, తమన్నా జంటగా నటించిన 'ఎందుకంటే ప్రేమంట' సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశారు. తల్లిదండ్రులు, తన సోదరుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిజం చేశాడు.


Also Readపెళ్లికి ముందు ప్రెగ్నెంట్, అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?


యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య స్నేహితుడిగా 'యుద్ధం శరణం' సినిమాలో నటించారు. అది జయదేవ్ కెరీర్‌లో ఫస్ట్ బ్రేక్ అని చెప్పాలి. ఆ సినిమా పోస్టర్లలో అతను కూడా ఉన్నారు. మధ్యలో షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు. 'ప్రేమిక' లఘు చిత్రానికి గాను సైమా అవార్డుకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్ 'అర్ధమైందా అరుణ్ కుమార్'లో విలన్ రోల్ మంచి గుర్తింపు తెచ్చింది.


Also Readతండ్రికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చి పిల్లను పడేశాడు - ఆమిర్ ఖాన్ అల్లుడి బ్యాగ్రౌండ్ తెలుసా?