Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ వద్దకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు కలిసి వచ్చారు. కింగ్ అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల కలిసి వచ్చి వెళ్లారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత కూడా అంతే... కలిసి వచ్చారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన సైతం కలిసి వచ్చారు. శ్రీకాంత్, ఊహ... ఇలా చెబుతూ వెళితే చాలా మంది స్టార్ కపుల్స్ ఎన్నికల్లో కలిసికట్టుగా వచ్చి ఓటు వేసి వెళ్లారు. అయితే?
విడివిడిగా ఓటు వేసిన అల్లు అర్జున్, స్నేహ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ఆయన భార్య స్నేహ రెడ్డి విడివిడిగా ఓటు వేశారు. పోలింగ్ బూత్ దగ్గర వాళ్లిద్దరూ జంటగా కనిపించలేదు. వేర్వేరుగా వెళ్లి ఓటు వేసి వచ్చారు. ఎందుకు? అంటే...
బీఎస్ఎన్ఎల్ కేంద్రంలో అల్లు అర్జున్ ఓటు వేశారు. మరోవైపు స్నేహ రెడ్డి ఓటు ఎఫ్ఎన్‌సిసి (ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్)లో ఉంది. అందువల్ల, ఇద్దరూ విడి విడిగా ఓటు వేశారు. అయితే... వాళ్లిద్దరూ జంటగా వెళ్ళకపోవడం వల్ల కొంత మంది అభిమానుల్లో చర్చనీయాంశం అయ్యింది. ఎప్పుడూ జంటగా కనిపించే స్టార్ కపుల్ వేర్వేరు పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదీ సంగతి!
అభిమాని కోసం అల్లు అర్జున్ సెల్ఫీ వీడియో!
గురువారం ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్... ఆ తర్వాత ట్వీట్ కూడా చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరో వైపు పోలింగ్ కేంద్రం వద్ద అభిమానికి అల్లు అర్జున్ ఇచ్చిన సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ అభిమాని ఒకరు పోలింగ్ కేంద్రం వద్ద ఆయనకు ఒక రిక్వెస్ట్ చేశారు. తన సోషల్ మీడియాలో 13 వేల మంది ఫాలోయర్లు ఉన్నారని, మీరు గనుక ఒక వీడియో ఇస్తే తన అకౌంట్ ఫాలోయర్లు పెరుగుతారని కోరడంతో ఆయన సెల్ఫీ వీడియో ఇచ్చారు.
సినిమా తారలు ఎవరికి ఓటు వేశారు? ఈసారి తెలంగాణలో ఎవరికి అధికారం వస్తుంది? అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్ర ప్రజల చూపు సైతం తెలంగాణ ఎన్నికల మీద ఉంది. డిసెంబర్ 3న... ఆదివారం ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న సంగతి తెలిసిందే.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply