Telangana Assembly Elections 2023 - Chiranjeevi fun moment: తెలంగాణ అసెంబ్లీ కోసం ఈ రోజు జరిగిన ఎన్నికలలో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. ఉదయమే ఓటు వేయడానికి వెళ్ళిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Cast His Vote)తో ఎన్నికల సరళి, ఆయన అభిప్రాయం గురించి మాట్లాడించడానికి ఓ న్యూస్ ఛానల్ విలేకరి విఫల యత్నం చేశారు. సదరు మీడియా ప్రతినిధికి చిరు ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.
మౌనవ్రతంలో ఉన్నాను - చిరు రిప్లై!
మెగాస్టార్ మౌనవ్రతంలో ఉన్నారు. ఈ విషయం ఎవరు చెప్పారు? అని ఎక్కువ ఆలోచించకండి! స్వయంగా చిరంజీవి చెప్పారు. సతీమణి సురేఖతో కలిసి ఓటు వేయడానికి క్యూ లైనులో నిలబడిన చిరంజీవి దగ్గరకు ఓ మీడియా ప్రతినిధి వెళ్లారు. ప్రశ్నలు వేయగా... 'మౌనవ్రతం' అని చిరంజీవి చెప్పారు. ఆ తర్వాత మరో ప్రశ్న వేయగా... గొంతు మీద చెయ్యి చూపిస్తూ విలేకరిని వెనక్కి పంపిచారు.
మౌనవ్రతం లీక్ చేసిన మెగాస్టార్!
మెగా లీక్స్ తరహాలో తాను మౌనవ్రతంలో ఉన్న విషయాన్ని కూడా చిరంజీవి లీక్ చేశారంటూ సోషల్ మీడియాలో నెటిజనులు పోస్టులు చేస్తున్నారు. 'బాస్ మౌనవ్రతం అని బాసే చెప్పారు' అంటూ ట్వీట్ చేశాడో నెటిజన్!
Also Read: యానిమల్ వయలెన్స్... సలార్ యాక్షన్... డిసెంబర్‌లో ధూమ్ ధామ్ థియేటర్లలోకి భారీ అండ్ క్రేజీ సినిమాలు
మధ్యాహ్నం ఓటు వేయనున్న రామ్ చరణ్!
మెగాస్టార్ తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురువారం మధ్యాహ్నం తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. చిరుతో పాటు ఆయన రెండో కుమార్తె శ్రీజ కొణిదెల సైతం ఉదయం ఓటు వేశారు. రామ్ చరణ్ మాత్రం కాస్త ఆలస్యంగా పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. సౌత్ ఇండియన్ స్టార్ ఫిల్మ్ మేకర్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ తీస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మైసూరులో జరుగుతోంది. ఓటు వేయడం కోసం ఆ షూటింగుకు చిన్న బ్రేక్ ఇచ్చిన చరణ్... బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఓటు వేసిన తర్వాత మళ్ళీ మైసూరు వెళతారని తెలిసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శక ధీరుడు రాజమౌళి, రానా దగ్గుబాటి, సుకుమార్, హీరోలు రవితేజ, గోపీచంద్, నితిన్, సాయి ధరమ్ తేజ్ తదితరులు సైతం ఉదయం తమ ఓటు వేశారు.