ఆనంద్ మహీంద్రా.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆనంద్ మహీంద్రా.. పేదరికంలో ఉన్నవారిని ఆదుకుంటూ.. కష్టాల్లో ఉన్న వారికి తన సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పిస్తూ మంచి మనిషిగా కూడా గుర్తింపు పొందారు. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎలాంటి ప్రశ్నకైనా తన స్టైల్ లో సమాధానాలిస్తూ ఆకట్టుకుంటారు. యూత్ లో కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. 


బిజినెస్ టైకూన్ గా మారిన ఆనంద్ మహీంద్రా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పటివరకు ఆటోమొబైల్ రంగంలో ఉన్న ఈయన ఇప్పుడు చిత్రనిర్మాణ రంగంలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం విశేషం. టెక్ మహీంద్రా నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు తదితరులు హాజరయ్యారు. 


ఆనంద్ మహీంద్రా ఆహ్వానం మేరకు హీరో అడివి శేష్, డైరెక్టర్ నాగ్ అశ్విన్, బోయపాటి శ్రీను, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, మిథాలీ రాజ్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలపై తనకున్న ఆసక్తి గురించి వెల్లడించారు ఆనంద్ మహీంద్రా. చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. తన యంగేజ్ లో ఫిల్మ్ మేకర్ అవ్వాలనే ఆశ ఉండేదని అన్నారు ఆనంద్ మహీంద్రా. ఈయన గనుక ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెడితే.. భారీ బడ్జెట్ సినిమాల సంఖ్య పెరగడం ఖాయం. ఇప్పటికే ఆనంద్ మహీంద్రా 'ప్రాజెక్ట్ K' సినిమాకి సహాయం చేస్తున్నారు. ఈ సినిమాలో వింటేజ్ వెహికల్స్ నిర్మాణంలో ఆనంద్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన కొందరు వ్యక్తులు పని చేస్తున్నారు.


Also Read : రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: మాస్ మహారాజా రవితేజ సక్సెస్ అందుకున్నారా? లేదా?


Also Read : విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?