Sajjala : పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తేనో .. సహాయ పునరావాస చర్యలు చేపట్టకుండా ప్రాజెక్టులో నీళ్లు నింపితేనో గగ్గోలు పెట్టాలి కానీ.. ఏమీ లేకుండా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ పర్యటనలో పోలవరం విషయంలో ఆచరణాత్మక ప్రణాళికతో ఆర్ అండ్ ఆర్‌పై ప్రకటన చేశారని తెలిపారు. కేంద్రం నుండి నిధులు రావటం లేటైనా 41.5 అడుగుల వరకూ ఆర్ అండ్ ఆర్ తాను ఇస్తాను అని సీఎం చెప్పారన్నారు.
చీకోటి ప్రవీణ్ లిస్టులో ఉన్న వాళ్లంతా ఈడీ ముందు క్యూ కట్టాల్సిందే - నోటీసులు రెడీ అయ్యాయా ?
రెండేళ్లలో కేంద్రం ఇవ్వకపోతే తామే ఇస్తామని జగన్ చెప్పారన్న సజ్జల
5.5 అడుగుల వరకూ పూర్తిగా నీటిని నింపాలంటే రెండేళ్ళు పడుతుందని... ఈలోపు కేంద్రం నుండి నిధులు తీసుకొస్తామన్నారని తెలిపారు. పోలవరం కోసం రాజీనామాలు చేయాలని చంద్రబాబు చేసిన డిమాండ్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించార.ు టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం, ప్రత్యేక హోదా కోసం ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు చరిత్ర హీనుడు అని... ప్రజలు చెత్త బుట్టలో పడేశారని వ్యాఖ్యానించారు.
జగన్, మీరు తోడు దొంగలు - అమరావతిలో సోము వీర్రాజుకు షాకిచ్చిన రైతు !
తిరుమలలో ఏం అపవిత్రత జరిగిందో చెప్పాలని అశ్వనీ దత్‌కు సజ్జల ప్రశ్న
ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్‌పైనా సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆశ్వనీ దత్ టీడీపీ కార్యకర్తలా మాట్లాడారన్నారు. వారంతా నిరాశా నిస్పృహల్లో ఉన్నారని విమర్శించారు. తిరుమల పవిత్రతకు ఏమైందో చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. సీతారామం సినిమా ప్రమోషన్లలో మీడియాతో మాట్లాడిన అశ్వనీ దత్ ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం బాగోలేదని మండిపడ్డారు. మూడేళ్ల పాలనలో తిరుపతిని సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు . గతంలో తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం తొలగించినప్పుడు చంద్రబాబును విమర్శించారని, ఆగమశాస్త్రం ప్రకారమే ఆయన వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించారని చెప్పారు.
చంద్రబాబును చెత్తబుట్టలో పడేశారని తీవ్ర విమర్శలు
ప్రస్తుతం తిరుపతిలో జరగని పాపం అంటూ లేదని ఆయన విమర్శించారు. ఆ ఏడుకొండల స్వామి జరుగుతున్న పాపాలను ఎందుకు చూస్తున్నాడో తెలియట్లేదని అశ్వినీదత్ ఆవేదన వ్యక్తం చేశారు. సమక్క సారక్కల జాతర గురించి విమర్శలు చేసిన చినజీయర్ స్వామి తిరుమలలో జరుగుతున్న పాపాల గురించి ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. తిరుపతిలో మతమార్పిళ్లు జరుగుతున్న మాట్లాడలేని స్ధితిలో చినజీయర్ స్వామి ఉన్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపైనే సజ్జల స్పందించారు.