మిళ్‌రాకర్స్(Tamilrockerz) ఈ పేరును ఎప్పుడో ఎక్కడో విన్నట్లు ఉంది కదూ. ప్రస్తుతం మీరు ‘ఐ బొమ్మ’ (Ibomma) మాయలోపడి.. తమిళ్‌రాకర్స్‌ను మరిచిపోయారేమో. యావత్ సినీ పరిశ్రమకు నిద్రలేకుండా చేసిన ‘తమిళ్ రాకర్స్’ పైరసీ ఆగడాలపై ఇప్పుడు ఏకంగా వెబ్ సీరిసే సిద్ధమైపోయింది. విడుదలైన గంటలోనే మీ సినిమాను ఆన్‌లైన్‌లో పెట్టేస్తామంటూ సవాల్ విసిరేస్థాయికి ఎదిగిన తమిళ్‌రాకర్స్‌.. సినీ ఇండస్ట్రీకి ఎలా తలనొప్పిగా మారారు? వారిని పట్టుకొనేందుకు పోలీసులు పన్నిన వ్యూహాలేమిటీ? చట్టానికి దొరక్కుండా పైరసీ మాఫియా ఎలా తప్పించుకుని తిరిగింది? ఇలా ఒకటేమిటీ ఇంకా చాలా విషయాలను ఈ వెబ్ సీరిస్‌లో చూడవచ్చు. తాజాగా విడుదల చేసిన ‘తమిళ్‌రాకర్స్’ ట్రైలర్ చూస్తే మీకు అంతా అర్థమైపోతుంది. అయితే, ప్రస్తుతం ఇది తమిళంలోనే ఉంది. స్ట్రీమింగ్ సమయానికి తెలుగులో డబ్ చేస్తారో లేదో చూడాలి. 


ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఓ స్టార్ హీరోతో నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రాన్ని పైరసీ చేసి.. ఆన్‌లైన్‌లో HD ప్రింట్ పెడతామంటూ తమిళ్‌రాకర్స్ ఇచ్చే వార్నింగ్‌తో అసలు కథ మొదలవుతుంది. ఎన్నో కోట్లు వెచ్చించి తీసిన ఈ సినిమా ఆన్‌లైన్‌లో వచ్చేస్తే నష్టపోతామంటూ నిర్మాతలు గగ్గోలు పెడతారు. వారు పోలీసులను, నిర్మాతల సంఘాన్ని ఆశ్రయిస్తారు. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటారు. వారిని పట్టుకొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. హ్యాకర్, ఆన్‌లైన్ నిపుణులను సైతం రంగంలోకి దింపుతారు. కానీ, వారు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటారు. సినిమాలంటే ఇష్టపడని పోలీస్ ఆఫీసర్‌కు తమిళ్‌రాకర్స్ మాఫియాను పట్టుకొనే బాధ్యతను అప్పగిస్తారు. మరి, తమిళ్‌రాకర్స్‌ను పోలీసులు పట్టుకోగలిగారా? పైరసీని అరికట్టగలిగారా? అనేది మిగతా కథ. ఇందులో పవన్ కళ్యాణ్ సినిమా ప్రస్తావన కూడా వస్తుంది. మాఫియా పవర్ స్టార్ సినిమాను కూడా పైరసీ చేసినట్లు పోలీసులు చర్చించుకొనే సీన్‌ ఈ ట్రైలర్‌లో ఉంది. 


ఈ వెబ్ సీరిస్‌లో అరుణ్ విజయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా అరుణ్ కనిపించనున్నాడు. అతడి ప్రియురాలి ఐశ్వర్య మీనన్.. అరణ్ భార్యగా నటిస్తోంది. వాణి భోజన్, అళగం పెరుమాళ్, వినోదిని, జి.మారిముత్తు, తరుణ్ కుమార్, వినోద్ సాగర్, శరత్ రవి, కాకముట్టై రమేష్, కక్కముట్టై విఘ్నేష్, అజిత్ జోషి తదితరులు నటిస్తున్నారు. అరుణ గుహన్, అపర్ణ గుహన్ శ్యామ్ నిర్మించిన ఈ వెబ్‌సీరిస్‌కు అరివళగన్ దర్వకత్వం వహించారు. ఈ వెబ్‌సీరిస్ ఆగస్టు 19 నుంచి SonyLIV ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఈ ట్రైలర్ చూసిన నెటిజన్స్.. స్ట్రీమింగ్ అయిన గంటలోనే ‘తమిళ్ రాకర్స్’ ఈ వెబ్ సీరిస్‌ను కూడా పైరసీ చేసి చూపిస్తారని అంటున్నారు.


Also Read: రవితేజ ఆన్ డ్యూటీ - మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే ట్రైలర్ వచ్చేసిందిగా


Also Read : మెగా 154 సెట్స్‌లో రవితేజ, వెల్కమ్ చెప్పిన చిరంజీవి - మెగా మాస్ కాంబో షురూ