సినిమాలు... వెబ్ సిరీస్‌లు... ఇప్పుడు తమన్నా భాటియా (Tamannaah Bhatia) బిజీగా ఉన్నారు. ఆమె చేతి నిండా కొత్త ప్రాజెక్టులే. ఇప్పుడు అని కాదు గానీ, మిల్క్ బ్యూటీగా ప్రేక్షకులు ముందుగా పిలుచుకునే ఈ అందాల భామ ఎప్పుడూ బిజీనే. అయితే... ఈ ఏడాది ఆమె లైనప్ మామూలుగా లేదు. ఎలా లేదన్నా సరే మూడు సార్లు థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది. ఓటీటీ స్క్రీన్ మీద కూడా సందడి చేయవచ్చు. కొత్త ప్రాజెక్టుల గురించి తమన్నా అప్డేట్స్ ఇచ్చారు. 


త్వరలో చిరుతో చిత్రీకరణకు!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి జోడీగా తమన్నా నటిస్తున్న సినిమా 'భోళా శంకర్' (Bhola Shankar Movie). 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత వాళ్ళిద్దరూ నటిస్తున్న చిత్రమిది. చిత్రీకరణ ఎప్పుడో మొదలైంది. కొంత సినిమా తీసేశారు కూడా! అయితే... ఇంకా తమన్నా పార్ట్ స్టార్ట్ కాలేదు. త్వరలో 'భోళా శంకర్' సెట్స్ లో అడుగు పెడతానని ఆమె తెలిపారు. 


రజనీతో... ఎప్పట్నుంచో కల! 
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'కొలమావు కోకిల', 'వరుణ్ డాక్టర్', 'బీస్ట్' సినిమాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం 'జైలర్'. అందులోనూ తమన్నా నటిస్తున్నారు. తాను ఎప్పటి నుంచో రజనీతో నటించాలని కలలు కంటున్నాని, అది ఇప్పటికి నెరవేరిందని చెప్పుకొచ్చారు.


హాట్‌స్టార్‌లో సిరీస్ చేస్తున్నా!
సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా తమన్నా చేస్తున్నారు. ఆల్రెడీ 'ఆహా' కోసం 'లెవెన్త్ అవర్' చేశారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన 'నవంబర్ స్టోరీ'లో నటించారు. ఇప్పుడు హాట్‌స్టార్‌ కోసం మరో సిరీస్ చేస్తున్నారు. అయితే, దీనిని ఇంకా అనౌన్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం 'జీ ఖర్దా' సిరీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సిరీస్ షూటింగ్ జరుగుతోంది. 


అన్నిటి కంటే ముఖ్యమైన సిరీస్ 'లస్ట్ స్టోరీస్'. అందులో హైదరాబాదీ యువకుడు, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా నటిస్తున్నారు. ఆ సిరీస్ చేసేటప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారని ముంబై మీడియా కోడై కూస్తోంది. గోవాలో వాళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, లిప్ లాప్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆ సిరీస్ గురించి తమన్నా ఎక్కువ మాట్లాడలేదు. 'లస్ట్ స్టోరీస్' యాంథాలజీ సిరీస్. అందులోని ఓ కథలో తమన్నా కనిపించనున్నారు. ఇవి కాకుండా హిందీ సినిమా 'బోల్ చుడీయా', మలయాళ సినిమా 'బాంద్రా' చేస్తున్నారు. 


Also Read : డార్లింగ్ ఈజ్ బ్యాక్ - ప్రభాస్ కొత్త లుక్ చూశారా?


అజా ఫ్యాషన్స్ కొత్త స్టోర్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆ స్టోర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తమన్నా... కొత్త సినిమాలు, సిరీస్ వివరాలు వెల్లడించారు. ఇంకా అజా స్టోర్స్ గురించి తమన్నా మాట్లాడుతూ ''ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా కోసం, మా ఫ్యామిలీ కోసం ముంబైలో షాపింగుకు ఈ స్టోర్ కి వెళతాను. హైదరాబాద్ స్టోర్ ఓపెనింగుకు నన్ను ఆహ్వానించినందుకు డాక్టర్ అల్కా నిషార్, దేవాంగి పరేఖ్‌కు థాంక్స్'' అని చెప్పారు.


Also Read : 'అమిగోస్' రివ్యూ : నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎలా ఉందంటే?