నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకుంది నటి తాప్సీ. తెలుగులో సరైన అవకాశాలు లేనప్పటికీ హిందీలో మాత్రం దూసుకుపోతుంది. సినిమా ఇండస్ట్రీలో స్త్రీ, పురుష సమానత్వం ఉండదని ఆమె అంటారు. ప్రస్తుతం తాప్సీ "శభాష్ మిథు" చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శభాష్ మిథు చిత్రానికి రాహుల్ దోలాకియా దర్శకత్వం వహిస్తున్నారు. రెండేళ క్రితమే చిత్రాన్ని ప్రకటించినా కొన్ని కారణాల వల్ల ఆలస్యమయింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అందులో తాప్సీ మిథాలీ రాజ్ గా అదరగొట్టారు. జులై 17 న ఈ చిత్రం విడుదలకానుంది. 


టీమిండియా మహిళా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మహిళా క్రికెటర్ల వీడియోలు చూద్దామని బీసీసీఐని కలిశాము. కానీ వాళ్ళ ఆటకి సంబంధించి ఎటువంటి వీడియోలు లేవని చెప్పేసరికి చాలా ఆశ్చర్యపోయినట్టు ఆమె చెప్పారు. ఇండస్ట్రీలో లింగ భేదం గురించి ఆమె మాట్లాడారు. పదేళ్ళ క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేదు ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని తాప్సీ అన్నారు. కానీ ఇప్పటికే స్త్రీ, పురుష సమానత్వానికి మేము దూరంగానే ఉన్నామని చెప్పారు. తన సినిమా బడ్జెట్ మొత్తం కలిపితే ఎంత ఉంటుందో ఒక హీరో రెమ్యునరేషన్ అంత ఉంటుందని అన్నారు. సమానత్వం వైపు మేము అడుగులు వేస్తున్నాం ఆ విషయంలో తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.


Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు


బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సరసన తాప్సీ(Taapsee) డంకి(Dunki Movie) సినిమాలో నటిస్తున్నారు. షారూఖ్ తో కలిసి పని చెయ్యడం అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా తాప్సీ చెప్పుకొచ్చారు. రాజ్ కుమార్ హిరాణి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ డ్రీం ప్రాజెక్టు లో నటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సినిమా 2023 కిసెంబర్ 23 న విడుదల చేయనున్నారు. తాప్సీ గతేడాది అవుట్ సైడర్స్ ఫి ల్మ్స్అనే పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.


Also Read : కమల్ హాసన్‌కు, నాగార్జునకు పోలిక ఏంటి?