లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan), కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మధ్య కంపేరిజన్స్ వస్తాయా? వాళ్ళిద్దరి సినిమాల మధ్య పోలికలు వస్తాయా? ఏమో... రావచ్చు, రాకపోవచ్చు. కానీ, ప్రస్తుతానికి అయితే ఇద్దరి సినిమాల మధ్య కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. నాగార్జున సినిమా విడుదలైతే తప్ప... కామన్ పాయింట్స్‌లో ఎన్ని కనెక్ట్ అవుతానేది చెప్పలేం!


'విక్రమ్' (Vikram Movie)తో కమల్ హాసన్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశారు. థియేటర్లలో, బాక్సాఫీస్ బరిలో దుమ్ము దులిపేసిన ఈ సినిమా... ఇప్పుడు ఓటీటీ వీక్షకులను సైతం ఆకట్టుకుంటోంది. 'విక్రమ్'కు, కింగ్ నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' (The Ghost Movie) సినిమాకు మధ్య కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దామా?


ఫస్ట్ అండ్ ఫస్ట్... పేర్లు!
'ది ఘోస్ట్' సినిమాలో హీరో నాగార్జున పేరు ఏంటో తెలుసా? విక్రమ్! అవును... విక్రమే! కమల్ హాసన్ పేరు మాత్రమే కాదు... సినిమా టైటిల్ కూడా అదే! రెండు సినిమాల్లో హీరోల పేర్లు ఒకటే కావడం యాదృశ్చికం కావచ్చు.


సెకండ్ థింగ్... ఘోస్ట్!
కమల్ హాసన్ 'విక్రమ్'లో ఒక థీమ్ సాంగ్ ఉంది... 'వన్స్ అపాన్ ఏ టైమ్, డేర్ లివ్డ్ ఏ ఘోస్ట్' అని! చంపడంలో 'ఘోస్ట్' లాంటి వాడని అర్థం వచ్చేలా సాంగ్ డిజైన్ చేశారు. ఇక, నాగార్జున సినిమా టైటిలే 'ది ఘోస్ట్'. ఇది రెండో కామన్ థింగ్. ఇదీ యాదృశ్చికం కావచ్చు.


ఇద్దరూ ఏజెంట్స్!
సినిమా టైటిల్స్, హీరోల పేర్లు కామన్ అయితే కంపేరిజన్స్ వస్తాయా? అనొచ్చు. అది అసలు విషయం కాదు... రెండు సినిమాల నేపథ్యమూ ఒక్కటే! 'విక్రమ్'లో కమల్ హాసన్ మాజీ రా ఏజెంట్ రోల్ చేశారు. 'ది ఘోస్ట్'లో నాగార్జున మాజీ 'రా' ఏజెంట్ రోల్‌లో కనిపించనున్నారు. హీరోల క్యారెక్టర్స్, సినిమాల బ్యాక్‌డ్రాప్‌ కూడా ఒక్కటే.


మోస్ట్ ఇంపార్టెంట్... సెంటిమెంట్!
'విక్రమ్' యాక్షన్ ఉంది. అంతకు మించి సెంటిమెంట్ కూడా ఉంది. కొడుకును చంపిన డ్రగ్ మాఫియా అంతు చూసిన మాజీ ఏజెంట్‌గా కమల్ భావోద్వేగాన్నీ పండించారు. మనవడితో అనుబంధం హైలైట్ అయ్యాయి. ఆ ఎమోషనల్ బాండింగ్ 'విక్రమ్'కు కీలకంగా నిలిచింది. 'ది ఘోస్ట్' సినిమాలోనూ అటువంటి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని తెలిసింది. ఇందులో నాగార్జునకు సోదరిగా గుల్ పనాగ్, ఆమె కుమార్తెగా మేనకోడలు పాత్రలో అనిఖా సురేంద్రన్ నటించారు. వీళ్ళ సెంటిమెంట్ సినిమాకు కీలకం అవుతుందట!


లాస్ట్ బట్ నాట్ లీస్ట్... ఫైట్స్!
'విక్రమ్'లో ఫైట్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో 'ది ఘోస్ట్'లో ఫైట్స్ ఉన్నాయని టాక్. ఒక్క విషయం గమనిస్తే... 'విక్రమ్' నుంచి కమల్ హాసన్ కత్తితో ఉన్న పోస్టర్ ఒకటి విడుదలైంది. రీసెంట్‌గా 'ది ఘోస్ట్' టీజర్ విడుదల చేశారు. అందులో నాగార్జున కూడా కత్తి పట్టుకుని ఉన్నారు. ఆ ఫైట్ అందర్నీ ఆకట్టుకుంది.


Also Read : కృతి శెట్టి వయసెంత? - ఇదిగో రామ్ స్పందన


సినిమాల మధ్య కంపేరిజన్స్ రావడం కామన్. అయితే... దర్శకుడిని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. ఎన్టీఆర్ 'టెంపర్', కళ్యాణ్ రామ్ 'పటాస్' తీసుకుంటే... రెండు కథల్లో చాలా కామన్ పాయింట్స్ ఉంటాయి. కానీ, 'టెంపర్' పూరి జగన్నాథ్ స్టైల్‌లో ఉంటే... 'పటాస్' అనిల్ రావిపూడి స్టైల్‌లో ఉంటుంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు ఒక స్టైల్ ఉంది. 'గరుడవేగ'తో స్టైలిష్ యాక్షన్ సీన్స్ తీయడంలో తన టాలెంట్ ఏంటనేది చూపించారు. 'ది ఘోస్ట్'లో డిఫరెంట్‌గా తీసి ఉంటారని ఊహించవచ్చు.



Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు