గత కొంత కాలంగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నారు ఆ వివాదాస్పద జర్నలిస్ట్. రీసెంట్ గా పలు సినిమా ప్రెస్ మీట్లలో ఆయన అడిగిన పిచ్చి ప్రశ్నలు నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు, ఆయన  వెకిలి ప్రశ్నలు సదరు చిత్ర బృందాలకు చిర్రెక్కిచ్చిన సందర్భాలున్నాయి. ఆయన అడిగిన ప్రశ్నలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు. ఆయన మాటలకు ఫన్నీ ఫన్నీ ఫోటోలు, వీడియోలు యాడ్ చేసి మీమ్స్ తో ఆటాడేసుకున్నారు.  అయినప్పటికీ, ఆయన తన పద్దతి మార్చుకోకపోవడంతో నెటిజన్లు డోస్ పెంచి మరీ తిట్టిపోస్తున్నారు. ఎవరు ఏం అనుకున్నా డోంట్ కేర్ అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. కాసేపు ఆయనపై ట్రోలింగ్ విషయాన్ని పక్కన పెడితే, తాజాగా ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అందరిలో ఆసక్తి కలిగిస్తోంది.


స్టెప్పులతో దుమ్మురేపిన వివాదాస్పద జర్నలిస్ట్


ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. 67 ఏళ్లు పూర్తి చేసుకుని 68వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఓ ఛానెల్ స్పషల్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో వివాదాస్పద జర్నలిస్ట్ పాల్గొని సందడి చేశారు. స్టేజి మీద చిరంజీవి పాటలకు దుమ్మురేపే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. స్మోక్ లో ఓ అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ షోలో ఆయన డ్యాన్స్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ‘మెగాస్టర్ బర్డ్ డే సందర్భంగా డ్యాన్స్ చేశాను. చిరు పాటలకు స్టెప్పులు వేశాను. ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో ఇవాళ విడుదల అవుతుంది” అని ఆయన వెల్లడించారు.






ప్రస్తుతం ఈ వివాదాస్పద జర్నలిస్ట్ గురించి సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కొనసాగుతున్నా, ఒకప్పుడు ఆయనకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉండేది. ‘సంతోషం’ అనే పేరుతో ఓ సినీ వార పత్రికను స్థాపించారు. దానిని సక్సెస్ ఫుల్ గా రన్ చేశారు. ‘సంతోషం’ పేరుతో సినిమా అవార్డులను అందించారు. టాలీవుడ్ లో ఈ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారు.  ‘సంతోషం’ పత్రికతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత నిర్మాతగా మారారు. పలు సినిమాలను నిర్మించారు. వాటిలో కొన్ని చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కానీ, ఆయన వెకిలి ప్రశ్నల కారణంగా ఇండస్ట్రీలో చులకన అయ్యారు. జోకర్ గా ప్రొజెక్ట్ అయ్యారు. విపరీమైన ట్రోలింగ్ కు గురయ్యారు. ఆయన గొప్పతనం తెలియక చాలా మంది నెటిజన్లు ఆయనను జోకర్ గా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికైనా ఆయన ప్రెస్ మీట్లలో వెకిలి ప్రశ్నలు తగ్గిస్తే మంచిది అంటున్నారు సినీ పెద్దలు.      


Read Also: ఇటు థియేటర్స్, అటు ఓటీటీ - ఈ వారం చిన్న సినిమాలదే హవా!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial