ఎప్పటి లాగే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. గత వారం రజనీకాంత్ ‘జైలర్’, చిరంజీవి ‘భోళా శంకర్’ లాంటి పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. ఈ వీక్ థియేటర్లతో పాటు, ఓటీటీలో పలు చిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి.


ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు   


1. మిస్టర్‌ ప్రెగ్నెంట్‌- ఆగస్టు 18న విడుదల


సొహైల్‌, రూపా కొడువయూర్‌  హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’.  శ్రీనివాస్‌ వింజనంపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మాతలుగా వ్యవహరించారు.  సుహాసిని, అలీ, బ్రహ్మాజీ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 18న విడుదలకానుంది.


2.ప్రేమ్‌కుమార్‌- ఆగస్టు 18న విడుదల


సంతోష్‌ శోభన్‌ హీరోగా, రాశీ సింగ్‌, రుచిత సాధినేని హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రేమ్‌కుమార్‌’. రచయిత అభిషేక్‌ మహర్షి ఈ మూవీతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ లో  శివ ప్రసాద్‌ పన్నీరు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి స్థాయిలో కామెడీ చిత్రంగా రూపొందిన  ‘ప్రేమ్‌కుమార్‌’ అందరినీ ఆకట్టుకుంటుందని చిత్రబృందం ప్రకటించింది.


3. జిలేబి- ఆగస్టు 18న విడుదల


తెలుగులో పలు చిత్రాలతో మెప్పించిన దర్శకుడు కె.విజయ భాస్కర్‌ తనయుడు శ్రీ కమల్‌ను హీరోగా ‘జిలేబి’ సినిమా తెరకెక్కింది. శివానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.  గుంటూరు రామకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.  


4. ‘డీడీ రిటర్న్స్‌ భూతాల బంగ్లా’- ఆగస్టు 18న విడుదల


తమిళ యాక్టర్ సంతానం నటించిన హారర్‌, కామెడీ చిత్రం ‘డీడీ రిటర్న్స్‌ భూతాల బంగ్లా’.ఇప్పటికే తమిళ నాట రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఆగష్టు 18న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు.  


ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు   


నెట్‌ఫ్లిక్స్‌


1. అన్‌టోల్డ్‌: ఆల్‌ ఆఫ్‌ షేమ్‌-హాలీవుడ్‌-ఆగస్టు 15న విడుదల


2. నో ఎస్కేప్‌ రూమ్‌-హాలీవుడ్‌-ఆగస్టు 15న విడుదల


3. డెప్‌ వర్సెస్‌ హర్డ్‌-డాక్యుమెంటరీ సిరీస్‌-ఆగస్టు 16న విడుదల


4. గన్స్‌ అండ్‌ గులాబ్స్‌-హిందీ సిరీస్‌-ఆగస్టు 18న విడుదల


5. మాస్క్‌ గర్ల్-కొరియన్‌ సిరీస్‌-ఆగస్టు 18న విడుదల


అమెజాన్‌ ప్రైమ్‌


1. హర్లాన్‌ కొబెన్స్‌ షెల్టర్‌-వెబ్‌ సిరీస్‌-ఆగస్టు 18న విడుదల


జీ5


1. ఛత్రపతి-హిందీ-ఆగస్టు 15న విడుదల


బుక్‌ మై షో


1. బాబిలోన్‌ 5: రోడ్‌ హోమ్‌-హాలీవుడ్‌- ఆగస్టు 15న విడుదల


2. డాంఫైర్‌-హాలీవుడ్‌-ఆగస్టు 15న విడుదల


3. స్టోరీస్‌ నాట్‌ టూబీ టోల్డ్‌-హాలీవుడ్‌-ఆగస్టు 15న విడుదల


జియో


1. తాలీ-హిందీ-ఆగస్టు 15న విడుదల


2. ఫ సే ఫాంటసీ-హిందీ-ఆగస్టు 15న విడుదల


ఈటీవీ విన్‌


1. అన్నపూర్ణా ఫొటో స్టూడియో-తెలుగు-ఆగస్టు 15న విడుదల   


Read Also: ‘విరూపాక్ష’ సీక్వెల్ వచ్చేస్తోంది - మరి హీరో ఎవరు?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial