సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైమ్ రానే వచ్చింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్ బాబు కలిసి తీయబోతున్న సినిమాకు సంబంధించి చిత్ర బృందం సూపర్ అప్డేట్ ఇచ్చింది. SSMB28 సినిమా షూటింగ్ స్టార్ అయినట్టు తెలుపుతూ సెట్స్ లో త్రివిక్రమ్, మహేశ్ కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎపిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ స్టార్ అయిందని తెలిపింది. మాస్ లుక్ లో మహేశ్ కనిపించబోతున్నారు. త్వరలోనే మీ కోసం మరిన్ని సర్ ప్రైజ్ లు ఎదురు చూడబోతున్నాయని చిత్ర బృందం తెలిపింది. మహేశ్ నటిస్తోన్న 28 వ చిత్రం ఇది. 


మహేశ్ కొత్త లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎప్పుడు కనిపించనంత కొత్తగా ఇందులో ఆయన కనిపించనున్నారు. మహేశ్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’లోనూ మహేశ్ ని చాలా డిఫరెంట్ గా త్రివిక్రమ్ చూపించారు. తనకి ఎంతగానో కలిసొచ్చే ఫ్యామిలీ సెంటిమెంట్ ని ఈసారి పక్కన బెట్టి మహేష్ కోసం యాక్షన్ సీక్వెన్స్ సిద్ధం చేశారు.


ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.


తమన్ కూడా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్టు సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ బెస్ట్ విసెష్ చెప్పారు. ఈ సినిమాకు అర్జునుడు అనే టైటిల్ పెట్టాలని పరిశీలిస్తున్నారు. త్రివిక్రమ్ కి A అనే అక్షరం చాలా సెంటిమెంట్. అందుకే ఆయన తీసిన సినిమాలు దాదాపు ‘అ’ లెటర్ మీదే ఉంటాయి. ఇప్పుడు కూడా తనకి ఏంటో కలిసొచ్చే అ మీదే టైటిల్ పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.


ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. 2006 ఏప్రిల్ 28 న మహేశ్ నటించిన పోకిరి చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయి రికార్డులు సృష్టించింది. మళ్ళీ అదే తేదీన SSMB28 చిత్రం విడుదల కానుంది. ఇది ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అని ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.


Also Read : కృష్ణం రాజు ఫంక్షన్ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన సీనియర్ ఎన్టీఆర్ 


Also Read: వాసన చూసి రుచి చెప్పేయొచ్చు, కృష్ణం రాజు చేపల పులుసు తయారీ వీడియో వైరల్!