Chhattisgarh Accident: ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోర్బా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
ఇదీ జరిగింది
వేగంగా వస్తున్న మెట్రో బస్సు ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంతాపం
ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు.
పిడుగుపాటు
మరోవైపు రాజస్థాన్‌లో మరోసారి పిడుగులు పడ్డాయి. జాల్వార్, ఉదయపుర్ జిల్లాల్లో పిడుగుపాటుకు గురై ఏడుగురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీ గంగానగర్, బార్మేర్, దుగార్ పుర్, బుండీ, అజ్మీర్, ఫలోది, బికనేర్ ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడ్డాయి.
పిడుగుపాటుకు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శనివారం కూడా పిడుగుపాటుకు ముగ్గురు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు.
Also Read: Gyanvapi Masjid Verdict: జ్ఞానవాపి మసీదు కేసులో నేడు కీలక తీర్పు- 144 సెక్షన్ విధించిన పోలీసులు
Also Read: Swami Swaroopanand Saraswati: స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం- ప్రధాని మోదీ సంతాపం