బాలీవుడ్ లో మరో విషాద ఘటన జరిగింది. హిందీ, మరాఠీ సినిమాల్లో అద్భుత నటిగా గుర్తింపు తెచ్చుకుని, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సులోచన లట్కర్ అనారోగ్యంతో కన్నుమూశారు. 94 ఏండ్ల వయసున్న సులోచన, వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో ముంబైలోని సుశృశా హాస్పిట్లో కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఆమెకు శ్వాసకోశ సమస్యలతో పాటు ఇతర వయస్సు సంబంధిత వ్యాధులు ఉన్నాయి. జూన్ 3 నుంచి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. వెంటనే ఆమెను డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచారు.  మూడు వారాల పాటు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటుంది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం(జూన్ 4న)  సాయంత్రం 6.30 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.  


1943లో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన సులోచన


సులోచన లట్కర్ జూలై 30, 1928న ప్రస్తుత కర్నాటకలోని బెల్గాం జిల్లా చికోడి తాలూకా ఖడక్లారత్ లో జన్మించారు. 1943లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆమె మరాఠీ, హిందీ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ‘కటీపతంగ్’, ‘దిల్ దేకో దేఖో’ , ‘గోరా ఔర్ కాలా’ లాంటి ఎవర్ గ్రీన్ మూవీస్ లో నటించింది. 'సంగత్యే ఐకా', 'మోల్కారిన్', 'మరాఠా తిటుకా మేల్వావా', 'సాది మానసం', 'ఏక్తి' చిత్రలు సులోచన కెరీర్ లో ఆణిముత్యాలుగా చెప్పుకోవచ్చు. మరాఠీ సినిమా పరిశ్రమలో అద్భుతంగా రాణించిన తర్వాతే,  సులోచనా హిందీ చిత్రసీమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హిందీలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.   


బాలీవుడ్ అగ్ర నటులతో సినిమాలు చేసిన సులోచన


సులోచన లట్కర్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, దిలీప్ కుమార్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖలో ఎన్నో సినిమాల్లో నటించింది. అందం, అభినయంతో వెండితెర అభిమానులు ఎంతగానో అలరించింది.  మోతీలాల్‌ తో ఆమె నటించిన 'ముక్తి' చిత్రం అద్భుత ప్రజాదరణ దక్కించుకుంది. పృథ్వీరాజ్ కపూర్, నజీర్ హుస్సేన్, అశోక్ కుమార్‌ తో కలిసి ఎన్నో చిత్రాలు చేసింది. హీరోయిన్ గా 40కి పైగా చిత్రాల్లో నటించింది. 1959లో వచ్చిన 'దిల్ దేకే దేఖో' చిత్రంలో  తొలిసారిగా తల్లి పాత్ర చేసింది. అప్పటి నుంచి 1995 వరకు ఎందరో ప్రముఖ నటీనటులకు తల్లిగా నటించింది. మొత్తంగా మరాఠీలో 50, హిందీలో 250 సినిమాలు చేసింది సులోచన.


పద్మశ్రీ, మహారాష్ట్ర భూషణ్ అవార్డులు అందుకున్న సులోచన


సినిమా పరిశ్రమకు సులోచన చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డులు రివార్డులు దక్కాయి.  1999లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు దక్కింది. 2009లో  'మహారాష్ట్ర భూషణ్' అవార్డు లభించింది. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును కూడా అందుకుంది. భాషలో సంబంధం లేకుండా ఆమె తన చక్కటి నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. సులోచన లట్కర్ మృతి పట్ల  ప్రధాని మోదీ, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్నేహితులు సంతాపం తెలిపారు. ఆమెకు ఆత్మ చేకూరాలని ఆకాంక్షించారు.  










Read Also: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!