జైలు నుంచే ఆర్థిక నేరాలకు పాల్పడిన సుకేష్ చంద్ర శేఖర్, తన సన్నిహితురాలు, సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు మరోసారి ప్రేమ లేఖ రాశాడు. సుకేష్ తన బర్త్ డే సందర్భంగా జైలు నుంచి ఈ లేఖను పంపాడు. ఆమెపై తనకున్న ప్రేమను ఈ లేఖలో వెల్లడించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ లేఖ జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతోంది.
ఇంతకీ తను లేఖలో ఏం రాశాడంటే?
‘‘మై బేబీ జాక్వెలిన్. నా బర్త్ డే రోజు నిన్ను చాలా మిస్ అవుతున్నా. నీ మాటలను, నీ ఎనర్జీని ఎంతగానో మిస్ అవుతున్నా. కానీ, నా మీద నీకున్న ప్రేమ ఎంతో గొప్పది. అది ఎప్పటికీ తగ్గదని నాకు తెలుసు. నీ అందమైన హృదయంలో ఏముందో నాకు బాగా తెలుసు. దానికి ఫ్రూఫ్స్ అవసరం లేదు. నా జీవితంలో వెల కట్టలేని కానుక ఏదైనా ఉంది అంటే అది నువ్వు మాత్రమే. బుట్టబొమ్మా నిన్ను నేను ఎంతో ప్రేమిస్తున్నాను” అంటూ సుకేష్ ఆ లేఖలో రాశాడు. హోలీ సందర్భంగా ఇలాంటి లేఖనే రాసిని సుకేష్, తాజాగా ఆయన బర్త్ డే సందర్భంగా మరో ప్రేమ లేఖ ఆమెకు పంపాడు.
సుకేష్ నుంచి ఖరీదైన బహుమతులు పొందిన జాక్వెలిన్
సుమారు రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆయన నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఆమెను కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చారు. పలుమార్లు ఆమెను విచారించారు కూడా. అయితే, తనను కావాలని ఈ కేసులో ఇరికించినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సుకేష్ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించింది. తన జీవితంలో ఆడుకుని, కెరీర్ ను మొత్తం చెడగొట్టాడని న్యాయస్థానం ముందు వాగ్మూలం ఇచ్చింది. హోంశాఖలో అధికారిగా పరిచయం చేసుకుని, తనను సంబంధంలేని కేసులో ఇరికించాడని బాధపడింది. సుకేష్ ఓ మోసగాడని గుర్తించలేకపోయానని చెప్పింది. తనని నయవంచనకు గురి చేసి, తప్పుదారి పట్టించాడని వెల్లడించింది. ఈ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. జైలులో ఉండి కూడా సుకేష్ తనతో ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడేవాడని జాక్వెలిన్ తెలిపింది. ఏనాడూ తను జైల్లో ఉన్న విషయాన్ని అతడు చెప్పలేదని చెప్పింది.
Read Also: 39వ వసంతంలోకి రామ్ చరణ్, #RC15 సెట్స్ లో ఘనంగా బర్త్ డే వేడుకలు
Read Also: హ్యాపీ బర్త్ డే అమ్ములు - భార్యకు క్యూట్‌గా విషెష్ చెప్పిన ఎన్టీఆర్!