టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు అప్పుడే మొదలయ్యాయి. మార్చి 27న ఆయన బర్త్ డే కాగా, 26 నాడే సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. 38 నుంచి 39వ వసంతంలోకి అడుగు పెడుతున్న చెర్రీకి శుభాకాంక్షలు చెప్పడం మొదలయ్యింది. #RC15 సెట్స్ లో చిత్ర బృందం అంతా కలిసి ఆయన బర్త్ డే సెలబ్రేట్ చేసింది. దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, హీరోయిన్ కియారా అద్వానీతో పాటు యూనిట్ సభ్యులంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. గులాబీ రేకులతో స్వాగతం పలికిన సినిమా యూనిట్, చెర్రీ చేత కేక్ కట్ చేయించి వేడుక నిర్వహించింది.   






#RC15 సెట్స్ లో చెర్రీ బర్త్ డే వేడుకలు


తొలుత కియారా అద్వానీ, రామ్ చరణ్ తో ఓ పాట చిత్రీకరించారు దర్శకుడు శంకర్. ఆ పాట షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చెర్రీ బర్త్ డే జరిపారు. చిత్ర బృందం సర్ ప్రైజ్ పట్ల చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు. ప్రస్తుతం చెర్రీ బర్త్ డే వేడుకలకు సంబంధించి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.  దిల్ రాజు నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న 50వ చిత్రంగా #RC15 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చెర్రీ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నాడు. అందులో ఒకటి రాజకీయ నాయకుడు కాగా, మరొకటి ఎన్నిలక అధికారి. ఇక ఈ చిత్రానికి థమన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.


ప్రపంచ వ్యాప్తంగా బర్త్ డే వేడుకలు


మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా  రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను నిర్వహించేందుకు ఆయన అభిమానులు రెడీ అవుతున్నారు. అన్ని దేశాల్లో వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ఆయన అభిమానులు సిద్ధం అవుతున్నారు. రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్ల పంపిణీ, వృద్ధులకు దుస్తుల పంపిణీ లాంటి కార్యక్రాలు చేపట్టబోతున్నారు.


చెర్రీకి వెరీ వెరీ స్పెషల్ బర్త్ డే


ఇక రామ్ చరణ్ కు ఈ పుట్టిన రోజు వెరీ వెరీ స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ‘RRR’ సినిమాతో ఎన్నో విజయాలను అందుకున్నారు. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఏకంగా ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. ఇక ఆస్కార్ వేడుకల కోసం అమెరికాకు వెళ్లిన చరణ్ కు అక్కడ ఎంతో గౌరవం లభించింది. అమెరికాలో పాపులర్ షో గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనే అరుదైన ఛాన్స్ దక్కించుకున్నారు. అంతేకాదు, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఈవెంట్ కి అతిథిగా హాజరయ్యారు.  హెచ్ సీ ఏ రామ్ చరణ్ ని స్పాట్ లైట్ అవార్డుతో సత్కరించి గౌరవించింది.


Read Also: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?