కొన్నిరోజులుగా టాలీవుడ్ లో 'మానాడు' సినిమా హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో శింబు హీరోగా నటించిన ఈ సినిమాను వెంకట్ ప్రభు డైరెక్ట్ చేశారు. ఇందులో ఎస్.జె.సూర్య విలన్ గా నటించారు. టైం లూప్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను గీతాఆర్ట్స్ తెలుగులో రీమేక్ చేస్తుందని వార్తలొచ్చాయి. ఆ తరువాత సురేష్ ప్రొడక్షన్స్ 'మానాడు' సినిమా రైట్స్ తమ దగ్గర ఉన్నట్లు వెల్లడించారు. 


దాంతో అసలు 'మానాడు' సినిమా గీతాఆర్ట్స్ నుంచి సురేష్ ప్రొడక్షన్స్ కి ఎలా వెళ్లిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసలు స్టోరీ ఏంటంటే.. 'మానాడు' సినిమాను తెలుగులో 'లూప్' పేరుతో డబ్ చేశారు. ఈ డబ్బింగ్ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి గీతాఆర్ట్స్ ను సంపాదించారు తమిళ నిర్మాతలు. దానికి గీతాఆర్ట్స్ కూడా అంగీకరించింది.


కమీషన్ బేసిస్ మీద సినిమాను గీతాఆర్ట్స్ విడుదల చేయడానికి రెడీ అయింది. అయితే తమిళనాట సెన్సార్ సమస్యల వలన 'మానాడు' సినిమా అక్కడ ఒకరోజు ఆలస్యంగా విడుదలైంది. దీంతో తెలుగులో 'లూప్' విడుదలను వాయిదా వేశారు. ఆ తరువాత 'మానాడు' తమిళంలో సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచన చేసింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ. వెంటనే తమిళనిర్మాతలను కలిసి రీమేక్ రైట్స్ కోసం అడిగారు. 


అయితే హీరో శింబు మాత్రం దానికి ఒప్పుకోలేదట. మిగిలిన భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఒప్పుకున్న ఆయన తెలుగులో మాత్రం డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేయాలని కండీషన్ పెట్టాడట. ఎందుకంటే ఈ సినిమా తమిళంలో బాగా ఆడింది. తెలుగులో విడుదల చేసినా హిట్ అవుతుందని.. ఆ విధంగా తన సినిమా సినిమాలకు మార్కెట్ ఏర్పడుతుందని భావించాడు. అందుకే తెలుగు రీమేక్ రైట్స్ మాత్రం ఇవ్వడానికి ఒప్పుకోలేదట. 


సురేష్ ప్రొడక్షన్స్ దగ్గర ఉన్నవి కూడా కేవలం డబ్బింగ్ రైట్స్ మాత్రమేనట. ఒకవేళ తెలుగులో రీమేక్ చేస్తే మాత్రం రూ.5 కోట్లు చెల్లించాలని శింబు షరతు పెట్టడంతో.. సురేష్ ప్రొడక్షన్స్ కూడా లైట్ తీసుకుందట. ఈ లెక్కన చూస్తుంటే.. 'మానాడు' సినిమా తెలుగులో రీమేక్ అయ్యే ఛాన్స్ లేదు. పోనీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవుతుందా అంటే.. ఇప్పటికే సోనీ లివ్ లో చాలా మంది ఈ డబ్బింగ్ వెర్షన్ చూసేశారు. మరేం చేస్తారో చూడాలి!


Also Read: రూ.180 కోట్ల భారం.. తన నెత్తిన వేసుకున్న జక్కన్న..


Also Read:'బంగార్రాజు' కష్టాలు.. చెప్పిన టైంకి వస్తాడా..?


Also Read: షూటింగ్ క్యాన్సిల్.. ఇంట్లోనే చిల్ అవుతోన్న రౌడీ హీరో..


Also Read: క్లాసులు షురూ.. ధనుష్ 'సార్' ఆన్ డ్యూటీ..


Also Read: కోవిడ్ పాజిటివ్ వైఫ్.. నితిన్ బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేశాడో చూశారా..?


Also Read: 'హృదయమా' ఫస్ట్ సింగిల్.. రిలీజ్ చేసిన మహేష్ బాబు..









ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.