సప్తగిరి... స్టార్ కమెడియన్‌. ఆయన కమెడియన్ మాత్రమే కాదు, హీరో కూడా! హాస్య నటుడిగా ప్రేక్షకులను నవ్వించిన ఆయన, హీరోగానూ మెప్పించారు. ఇప్పుడు హీరోగా మరో సినిమాకు సంతకం చేశారు. ఇప్పటివరకూ ఆయన హీరోగా చేసిన సినిమాలను కొత్త దర్శకులు, నిర్మాతలు లేదంటే చిన్నవారు చేశారు. ఈసారి మాస్ చిత్రాల దర్శకుడితో సినిమా చేస్తున్నారు. ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సప్తగిరి కథానాయకుడిగా ఓ సినిమా రూపొందనుంది.


హీరోగా గోపీచంద్‌కు 'యజ్ఞం' ఎంత బూస్ట్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'రేయ్' సినిమా విడుదల ఆలస్యమైన సాయి తేజ్‌ 'పిల్లా... నువ్వు లేని జీవితం'తో హీరోగా పరిచయమై, హిట్ అందుకున్నారు. ఆ రెండు చిత్రాలకు ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకుడు. ఇప్పుడు సప్తగిరి హీరోగా ఆయన సినిమా చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖ‌రారు చేయ‌లేదు. ఈ చిత్రాన్ని రిగ్వేద క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా ఎ.ఎస్. రిగ్వేద చౌదరి నిర్మించనున్నారు. ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాతో ర‌వికుమార్ చౌద‌రి ఫ్యామిలీ ప్రొడ‌క్ష‌న్‌లోకి అడుగు పెడుతుంద‌న్న‌మాట‌.


చిత్రనిర్మాత ఎ.ఎస్. రిగ్వేద చౌదరి మాట్లాడుతూ "సప్తగిరి హీరోగా వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు సరికొత్త కథ, కథనాలు ఉంటాయి. రవికుమార్ చౌదరి దర్శకత్వం సినిమాకు బలం. ఫిబ్రవరి ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి" అని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్: గౌతం రాజు, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, సినిమాటోగ్రఫీ: సిద్ధం మనోహర్, ఆర్ట్: రమణ వంక, కో-డైరెక్టర్: మురళీధర్ రావు, లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, సహ నిర్మాత: దేవినేని రవి, నిర్మాత: ఎ.ఎస్. రిగ్వేద చౌదరి, కథ - స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.ఎస్. రవికుమార్ చౌదరి.



Also Read: ధనుష్.. ఐశ్వర్య కంటే చిన్నోడు, హడావిడిగా పెళ్లి.. వీరిది చాలా చిత్రమైన ప్రేమ!
Also Read: ధ‌నుష్ కంటే ముందు ఆ హీరోతో ఐశ్వ‌ర్యా ర‌జ‌నీకాంత్ ప్రేమ‌లో ఉందా?
Also Read: ధనుష్, ఐశ్వర్య ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఆమేనా?
Also Read: ఏజ్ షేమింగ్ ఏంటి? నన్ను అలా పిలవద్దు! - స్ట్రాంగ్‌గా చెప్పిన అనసూయ
Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులపై వర్మ కామెంట్స్..
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి