సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ సినిమా (SSMB29 Movie) రూపొందనున్న సంగతి తెలిసిందే. బహుశా... వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 


'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి చేయబోయే చిత్రమిది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ప్రిన్స్, ఆ తర్వాత జక్కన్న సినిమా చేయనున్నారు. మహేష్ - రాజమౌళి కలయికలో ఏ జానర్ సినిమా రాబోతుంది? ఎటువంటి సినిమా చేస్తారు? అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఘట్టమనేని అభిమానులు అయితే మరీనూ!  దర్శక ధీరుడు చెప్పిన మాటలు వింటే వాళ్ళందరికి పూనకాలు రావడం ఖాయం.  


Mahesh Rajamouli Movie Is Globe Trotting Action Adventure : మహేష్ బాబుతో తాను తీయబోయే సినిమా యాక్షన్ అడ్వెంచర్ అని రాజమౌళి చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి టొరెంటోలో ఉన్నారు. అక్కడ ఫిల్మ్ ఫెస్టివల్‌కి రావాల్సిందిగా ఆహ్వానం అందడంతో వెళ్లారు. ''మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ సినిమా చేయబోతున్నా'' అని రాజమౌళి తెలిపారు. 


గ్లోబ్ ట్రాటింగ్ అంటే ఏంటి?
మహేష్ బాబుతో సినిమా చేయబోయే సినిమా జానర్ గురించి రాజమౌళి ఇలా చెప్పారో? లేదో? - దానికి అర్థం ఏమిటి? అని చాలా మంది గూగుల్ తల్లిని అడగటం మొదలు పెట్టారు. గ్లోబ్ ట్రాటింగ్ అంటే ఏంటంటే.... మంచి యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ అని! ప్రపంచమంతా రిలేట్ అయ్యే కంటెంట్ అందులో ఉంటుందని! పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్ రిలేట్ అవ్వొచ్చు అన్నమాట.


Also Read : మహేష్, త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ డే గ్లింప్స్ - 'గాడ్ ఫాదర్' నుంచి కొత్త సాంగ్!


ఈ సినిమా జానర్ మీద సరదా మీమ్స్ కూడా వస్తున్నాయి. ఎందుకూ అంటారా? గ్లోబ్ ట్రాటింగ్ అనే పదం అర్థం కాక! ఫ్యాన్స్ అయితే ఎలాంటి మీమ్స్ వేస్తున్నారో తెలుసా? 'ఈ పదం పలకడానికే పది నిమిషాలు పడుతోంది జక్కన్నా' అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను కె.ఎల్. నారాయణ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇటు మహేష్, అటు రాజమౌళికి ఆయన ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు. ఈ సినిమా చేయడం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నరు. ఆయన ఒక్కరే సోలోగా ప్రొడ్యూస్ చేస్తారా? లేదంటే మరొకరితో కలిసి చేస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే... రాజమౌళి సినిమా అంటే ప్రొడ్యూస్ చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. డీవీవీ దానయ్యకు అటువంటి ప్రపోజల్స్ వచ్చినా ఓకే చేయకుండా సోలోగా ప్రొడ్యూస్ చేశారు. 



ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు... వరల్డ్ ఆడియన్స్ కూడా 'ఆర్ఆర్ఆర్'  ఇచ్చిన హైలో ఉన్నారు. ఆ సినిమా రీ సౌండ్ ఫారిన్ దేశాల్లో మారుమోగుతూనే ఉంది. ఇప్పటికీ ఎవరో ఒక హాలీవుడ్ సెలబ్రిటీ.... 'ఆర్ఆర్ఆర్'పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి టేకింగ్‌కు అయితే... హాలీవుడ్ ఫిదా అవుతోంది.