భారతీయ సినిమా పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ‘బాహుబలి’ సినిమాతో ఖండాంతరాల్లో ఇండియన్ సినిమా సత్తా చాటారు. విదేశాల్లో బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టారు. ‘బాహుబలి’ విడుదలైన అన్ని దేశాల్లోనూ సంచలన విజయాన్ని అందుకుంది. కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టించింది. భారతీయ సినిమాలు అంటే కేవలం బాలీవుడ్ సినిమాలే అనే భ్రమను ఆయన పూర్తి స్థాయిలో తొలగించారు.
ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’
బాహుబలి సినిమా తర్వాత అదే స్థాయిలో రూపొందించిన తాజా సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం కూడా భారత్ తో పాటు పలు దేశాల్లో సంచలన విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నెలకొల్పింది. తాజాగా ఈ చిత్రం జపాన్ లో విడుదలై కనీవినీ ఎరుగని రీతిలో విజయాన్ని అందుకుంది. వసూళ్ల విషయంలో సత్తా చాటుతోంది. కేవలం 4 వారాల్లో 250 మిలియన్ జపాన్ యెన్స్ కలెక్ట్ చేసింది. ఇంత మొత్తం వసూలు చేయడానికి ‘బాహుబలి-2’ సినిమాకు 30 వారాల సమయం పట్టింది.
తాజాగా ‘బాహుబలి-2’ రికార్డును ‘ఆర్ఆర్ఆర్’ ఈజీగా బ్రేక్ చేసింది. జపాన్ లో ఈ సినిమా ఇంకా చాలా రోజులు రన్ అయ్యే అవకాశం ఉంది. జపాన్ లో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రజనీకాంత్ ‘ముత్తు’ కొనసాగుతోంది. ఈ సినిమా అప్పట్లో 400 మిలియన్ యెన్స్ సాధించింది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ జోరు చూస్తుంటూ ‘ముత్తు’ రికార్డును బద్దలుకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలో రాజమౌళి సందడి
మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రాజమౌళి ప్రతిభ మరోసారి అంతర్జాతీయంగా రుజువైంది. ప్రస్తుతం రాజమౌళి అంతర్జాతీయ సినిమా దర్శకుడిగా ఖ్యాతి గడించారు. ప్రపంచ ప్రఖ్యాత సినీ అవార్డుల వేడుకల్లో ఆయన సందడి చేస్తున్నారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత గవర్నర్ అవార్డ్స్ వేడుకకు హాజరయ్యారు. ఆస్కార్ అవార్డులు అనేవి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్మాత్మకమైనవి. ఈ అవార్డుల ప్రదానానికి ముందు గవర్నర్స్ అవార్డులు అందిస్తారు. ప్రపంచ ప్రఖ్యాత సినిమా దిగ్గజాలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. నిన్న(నవంబర్ 19న) లాస్ ఎంజెల్స్ లో జరిగిన ఈ అవార్డుల వేడుకకు భారత్ నుంచి రాజమౌళి హాజరయ్యారు. టాక్సేడో సూట్ లో ఆయన తళుక్కున మెరిశారు. అవార్డుల వేడుకలో సందడి చేశారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ మూవీ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో సాటర్న్ అవార్డును దక్కించుకుంది. ఇప్పటికే ‘బాహుబలి-2’ సినిమాకు గాను ఆయన సాటర్న్ అవార్డును స్వీకరించారు. జనరల్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను మొత్తంగా 15 విభాగాల్లో ఆస్కార్ కోసం దరఖాస్తు చేశారు.
❤️🔥❤️🔥❤️🔥 @ssrajamouli pic.twitter.com/V3ZNratBtg
Read Also: ఇండియానా జోన్స్ రేంజ్‌లో అడ్వెంచర్స్ - మహేష్ బాబు మూవీపై కీలక విషయాలు చెప్పిన రాజమౌళి