Guntur Kaaram 2nd single update: సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు & గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ సినిమాలో ఫస్ట్ సాంగ్ 'దమ్ మసాలా'ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. అయితే... రెండో సాంగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.


మహేష్ బాబుకు శ్రీ లీల ముద్దు
Oh My Baby Guntur Kaaram Song Release Date: 'గుంటూరు కారం' సినిమాలో మహేష్ బాబు సరసన  శ్రీ లీల ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వాళ్ళిద్దరి మీద తెరకెక్కించిన 'ఓ మై బేబీ' పాట త్వరలో విడుదల కానుంది. 


డిసెంబర్ 11... సోమవారం సాయంత్రం 4.05 గంటలకు 'ఓ మై బేబీ' సాంగ్ ప్రోమో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 13న... బుధవారం ఫుల్ సాంగ్ విడుదల చేస్తారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్టిల్ సూపర్ స్టార్, ఘట్టమనేని ఫ్యాన్స్, అలాగే ప్రేక్షకుల చూపును ఆకర్షించింది. మహేష్ బాబుకు శ్రీ లీల ముద్దు పెట్టారు. హీరోకి హీరోయిన్ ఎందుకు ముద్దు పెట్టారనేది ఆ పాటలో, సినిమాలో చూడాలి. తమన్ మాంచి మెలోడీ ట్యూన్ అందించారట.


Also Readహిందీ సినిమాలు 4, తమిళ సినిమాలు 2... తెలుగు నుంచి ఒక్కటీ లేదు - 2023లో పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్






ఈ నెలాఖరుతో చిత్రీకరణ పూర్తి!
Guntur Kaaram Shooting update: 'గుంటూరు కారం' చిత్రీకరణ ఈ నెలాఖరు లోపు పూర్తి కానుందని సమాచారం. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే.


Also Readఒక్కటే క్యారెక్టర్... రెండు సినిమాలు - ఇలాగైతే ఎలా శ్రీలీల, చూసుకోవాలిగా? 2023లో శ్రీలీల హిట్స్ & ఫ్లాప్స్!


'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో 'గుంటూరు కారం' రూపొందుతోంది. ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే... మహేష్ బాబును మాంచి మాసీగా చూపిస్తున్నారు త్రివిక్రమ్. ఇప్పటి వరకు విడుదల చేసిన మెజారిటీ స్టిల్స్ అన్నిటిలో బీడీ కలుస్తూ కనిపించారు మహేష్. సినిమాలో ఇంకెన్ని కాలుస్తారో చూడాలి. 


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు) ప్రొడ్యూస్ చేస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలోకి సినిమా రానుంది. ఆ రోజు తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'హను - మాన్', తర్వాత రోజు (జనవరి 13న) విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న 'సైంధవ్', మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న 'ఈగల్' సినిమాలు కూడా వస్తున్నాయి.