శర్వానంద్ తో 'ఒకే ఒక జీవితం' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకార్తిక్ మంచి హిట్ అందుకున్నారు. కమర్షియల్ గా ఈ సినిమా ఎంతవరకు వర్కవుట్ అయిందనే విషయం పక్కన పెడితే.. సినిమాలో ఎమోషన్స్ కి, సెంటిమెంట్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దర్శకుడిగా శ్రీకార్తిక్ కి మంచి మార్కులు పడ్డాయి. ఒక ఎమోషనల్ స్టోరీను సైన్స్ ఫిక్షన్ లో బ్లెండ్ చేసి తెరకెక్కించడం అందరికీ నచ్చింది. 


ఇదిలా ఉండగా.. ఇప్పుడు శ్రీకార్తిక్ తన నెక్స్ట్ సినిమాను స్టార్ హీరోతో చేయాలనుకుంటున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే అల్లు అర్జున్. ఈ విషయాన్ని శ్రీకార్తిక్ స్వయంగా వెల్లడించారు. తన కొత్త సినిమా తెలుగులో తీయబోతున్నట్లు.. పెద్ద స్కేల్ లో మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. 


తన దగ్గర ఒక ఫాంటసీ స్క్రిప్ట్ ఉందని.. రియలిజం ఫాంటసీలో క్రేజీగా ఉంటుందని.. తన రెండో సినిమా అల్లు అర్జున్ గారితో చేయాలనుందని చెప్పారు. ఆయనకి త్వరలోనే కథ చెప్పాలని అన్నారు. చెన్నైలో తెలుగు సినిమా అంటే అల్లు అర్జున్ సినిమానే అని.. ఆయనతో సినిమా చేయడానికి ఐదేళ్లు వెయిట్ చేయడానికి కూడా రెడీ అని చెప్పుకొచ్చారు. మరి శ్రీకార్తిక్ లాంటి దర్శకుడికి బన్నీ ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి!


ఇక బన్నీ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'పుష్ప2' సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. 


'పుష్ప' సినిమాకి క్రేజీ డీల్:
'పుష్ప' పార్ట్ 2 ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి కొన్ని సంస్థలు. 'పుష్ప'తో డీల్ క్లోజ్ చేయాలని చూస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం రూ.100 కోట్ల ఆఫర్ చేసిందట ఓ సంస్థ. మైత్రి మూవీస్ బ్యానర్ ఈ డీల్ పై ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. బన్నీ మాత్రం వద్దని చెప్పారట. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత బిజినెస్ ఇంకా బాగా జరుగుతుందని.. కాబట్టి అప్పటివరకు ఎలాంటి డీల్స్ ఓకే చేయొద్దని చెప్పారట. దీంతో ప్రస్తుతానికి ఈ క్రేజీ డీల్ ను పక్కన పెట్టేశారు. 'పుష్ప' పార్ట్ 1 సమయంలో మాత్రం డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులను ముందే అమ్మేశారు. ఈసారి మాత్రం అలా చేయడం లేదు.  


సుకుమార్ కి బన్నీ డెడ్ లైన్:
దర్శకుడు సుకుమార్ కి ఈ సినిమా విషయంలో బన్నీ డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. వందరోజుల్లో షూటింగ్ ను పూర్తి చేయాలని చెప్పాడట బన్నీ. 2023లో 'పుష్ప' పార్ట్ 2ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని చూస్తున్నారు. నిజానికి పార్ట్ 1 సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం దొరకలేదు. దీంతో ఆ ఎఫెక్ట్ సీజీ వర్క్ పై పడింది. సినిమాలో గ్రాఫిక్స్ సరిగ్గా లేదనే విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి కామెంట్స్ కి తావివ్వకుండా త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. గ్రాఫిక్స్ అండ్ మిగిలిన వర్క్ పై ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తున్నారు.


Also Read : గుణశేఖర్ అవుట్ - త్రివిక్రమ్ చేతికొచ్చిన రానా డ్రీమ్ ప్రాజెక్ట్!


Also Read : మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలే - సినిమా జానర్ రివీల్ చేసిన రాజమౌళి