టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘18 పేజెస్’. సుకుమార్ అందించిన కథతో ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ‘కార్తికేయ 2’ లాంటి భారీ హిట్ తర్వాత నిఖిల్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, పోస్టర్ లు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో తమిళ నటుడు శింబు తో ఓ పాటను పాడించనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ పాట రీ రికార్డింగ్ కు సంబంధిచిన ప్రోమో వీడియోను విడుదల చేసింది మూవీ టీమ్.
ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. వీడియోలో హీరో నిఖిల్, శింబుల మధ్య జరిగిన సరదా సంభాషణ ఆకట్టుకుంటోంది. పాటలో లిరిక్స్ మీనింగ్ పదాలు తమిళ్ లో ఉంటే తనకు పాడటానికి బాగుంటుందని, తెలుగులో కొంచెం కష్టంగా ఉంటుందని శింబు అంటుంటే.. ‘‘లేదు మీరు పాడాల్సిందే, ఇలా మీరు పాడితే బాగుంటుంది. ఆడియన్స్ కూడా హ్యీపీగా ఫీల్ అవుతారు. మీరు పాడకపోతే నేనే ఇక్కడే దర్నాకు దిగుతా’’ అంటూ నిఖిల్ శింబును ఒప్పించే ప్రయత్నం చేయడం సరదాగా కనిపించింది. ఇక ‘‘టైమ్ ఇవ్వు పిల్లా కొంచెం టైమ్ ఇవ్వు’’ అంటూ శింబు పాడిన లిరిక్స్ ఆకట్టుకోవడంతో ఈ పాట పై బజ్ మరింత పెరిగింది. డిసెంబర్ 5న పూర్తి పాట విడుదల కానుంది.
తెలుగు హీారోల సినిమాల్లో కోలీవుడ్ స్టార్ శింబు పాటలు పాడటం కొత్తేమీ కాదు. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' సినిమాలో 'డైమండ్ గాళ్', ఉస్తాద్ రామ్ పోతినేని 'ది వారియర్'లో ‘‘బుల్లెట్’’ తదితర పాటలను శింబు పాడారు. తెలుగులో ఆయన పాాడిన ప్రతీ పాట మంచి ఆదరణ పొందాయి. అందుకే ఇప్పుడు ‘18 పేజెస్’ లో ‘‘టైమ్ ఇవ్వు పిల్లా..’’ పాటపై కూడా అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల అయిన ‘‘నన్నయ రాసిన’’ అనే పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం హీరో నిఖిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డా ‘స్వామి రారా’ సినిమాతో మళ్లీ గాడిన పడ్డాడు. మంచి కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు ఈ యంగ్ హీరో. ‘కార్తికేయ 2’ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా విడుదల అయిన అన్ని చోట్లా భారీ సక్సెస్ ను అందుకుంది. హిందీ లో కూడా ఈ సినిమా భారీగానే కలెక్షన్స్ సాధించింది. ‘కార్తికేయ 2’ లో నిఖిల్ కు జంటగా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రం లో కూడా హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాకు గోపీసుందర్ స్వరాలు అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై 'బన్నీ' వాసు నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23 న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: కోలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి సందడి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన గౌతమ్, మంజిమా