ప్రాణం ఎప్పటికైనా పోవచ్చు. కానీ, పాట.. కలకాలం నిలిచిపోతుంది. ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం వంటి గానగాంధర్వులు మనతో లేకపోయినా.. వారి పాటలు మాత్రం మనతో నిలిచిపోతాయి. అయితే, పాటకు సంగీతం ఒక్కటే ఉంటే సరిపోదు. దానికి తగిన సాహిత్యం కూడా తోడు కావాలి. అదే దానికి ప్రాణం పోస్తుంది. మనసును తాకుతుంది. ప్రతి అక్షరం మదిలో నిలిచిపోతుంది. ఇందుకు రచయిత పడే శ్రమ అంతా ఇంతా కాదు. ఒక వైపు ఆ సినిమాలో సన్నివేశానికి సరిపడేలా లెరిక్స్‌ను అల్లుకోవడమే కాకుండా.. ఆ సంగీతంలో అమరిపోయేంత గొప్పగా సాహిత్యాన్ని రచించాల్సి ఉంటుంది. ఆ విషయంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రిని మించినవారు లేరు. ఆయన సాహిత్యం మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతుంది. సమాజాన్ని నిద్రలేపే విప్లవ గీతాల నుంచి.. కుర్రకారును ఉర్రూతలూగించే పాటల వరకు ప్రతి ఒక్కటీ.. గుండెను హత్తుకొనేలా రాయడం సిరివెన్నెలకే చెల్లుతుంది. చెప్పాలంటే.. ఆయన పాటల్లోని సాహిత్యం వింటే.. ప్రాణం పరవశిస్తుంది. అందుకే.. ఆయన పాటను స్మరిస్తూ.. టాలీవుడ్‌లో హిట్టయిన పలు గీతాలను ఇక్కడ అందిస్తున్నాం. సిరివెన్నలకు స్వరాంజాలి అర్పిస్తున్నాం. 


విధాత తలపున (సిరివెన్నెల): 



చందమామ రావే.. జాబిల్లి రావే (సిరివెన్నెల):



జాము రాతిరి జాబిలమ్మ.. (క్షణక్షణం): 



నిగ్గదీసి అడుగు.. (గాయం): 



బోటని క్లాస్ ఉంది.. (శివ):



తరలిరాదా తనే వసంతం (రుద్రవీణ):



జగమంత కుటుంబం నాది (చక్రం): 



నమ్మకతప్పని (బొమ్మరిల్లు): 



చిలుక ఏ తోడులేక (శుభలగ్నం): 



కొత్తగా.. (స్వర్ణ కమలం): 



తెలి మంచు కరిగింది.. (స్వాతి కిరణం): 



కొత్తగా కొత్తగా ఉన్నదే (కూలీ నెం.1):



అర్ధశాతాబ్దపు అజ్ఞానాన్ని.. (సింధూరం): 



ఎంతవరకు ఎందుకొరకు.. (గమ్యం):



Also Read: మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి!
Also Read: సిరివెన్నెల రాసిన ఈ రెండు పాటలే చివరివి... ఆర్ఆర్ఆర్‌లో ఆ పాట కూడా...
Also Read: 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి ఇక లేరు.. సాహిత్యానికి ముందు సాధారణ వ్యక్తిగా..
Also Read: సిరివెన్నెల పాట.. ప్రశ్నించే తూటా..
Also Read: వేల పాటలు రాసిన సిరివెన్నెలకు నచ్చిన పాట ఏది? నెటిజన్ల ముచ్చట్లలో ఏం చెప్పారు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి