ప్రేమగీతమైన, విరహరాగమైన, దేశభక్తి అయినా, విప్లవ గీతమైనా...సందర్భం ఏదైనా ఆయన రాసిన పాటలు హృదయాన్ని తాకుతాయి. కాలానికి తగ్గట్టుగా అన్ని తరాల వారిని మురిపిస్తాయి, మైమరపిస్తాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ సినిమాకి రాసిన పాటలతో గుర్తింపు సాధించి.. ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఇప్పటి వరకూ దాదాపు 3000కు పైగా పాటలు రాసిన సీతారామశాస్త్రి ఎన్నో అవార్డులు అందుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది.
Also Read: తొలిపాటకే 'నంది' అందుకున్న సిరివెన్నెల.. రాయడానికి ఎన్నిరోజులు పట్టిందంటే..
నంది అవార్డుల పాటలివి
1. సిరివెన్నెల (1986) – విధాత తలపున
2. శృతిలయలు (1987) – తెలవారదేమో స్వామి
3. స్వర్ణకమలం (1988) – అందెలరావమిది పదములదా
4. గాయం (1993) – సురాజ్యమవలనీ స్వరాజ్యమెందుకని
5. శుభ లగ్నం (1994) – చిలక ఏ తోడు లేక
6. శ్రీకారం (1996) – మనసు కాస్త కలత పడితే
7. సింధూరం (1997) – అర్ధ శతబ్దపు అజ్ఞానాన్నే
8. ప్రేమ కథ (1999) – దేవుడు కరుణిస్తాడని
9. చక్రం (2005) – జగమంత కుటుంబం నాది
10. గమ్యం (2008) – ఎంత వరకు ఎందుకు కోరకు
11. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) - మరి అంతగా
Also Read: మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి!
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు)..
1. నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
2. గమ్యం (2008)
3. మహాత్మ (2009)
4. కంచె (2015)
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్
ఉత్తమ గేయ రచయిత (తెలుగు) – కంచె (2015)
రుద్రవీణలో పాటలకు 1988లో 'ద సినీ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియా కళైంజర్ కరుణానిథి అవార్డ్'
1999లో తులసీదళం టీవీ సీరియల్ కోసం రాసిన హాయిగా ఉంది, నిదరపో పాటలకు బుల్లితెర అవార్డ్ వచ్చింది.
1991 లో మనస్విని సంస్థవారు ఆత్రేయ జయంతి సందర్భంగా ఆత్రేయ బంగారు కిరీటం బహూకరించి సత్కరించారు.
Also Read: సిరివెన్నెల దృష్టిలో 'క్లిష్టమైన పాట..'
Also Read: 'సిరివెన్నెల'కు ముందు సీతారామ శాస్త్రి జీవితం ఇదీ...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి