SIIMA Awards 2022 Winners: అవార్డులన్నీ కొట్టేసిన 'పుష్ప' - సైమాలో టాలీవుడ్ స్టార్స్ సందడి!

'సైమా'(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డుల పురస్కారం బెంగుళూరు వేదికగా ఈ శని, ఆదివారాలు ఎంతో గ్రాండ్ గా జరుగుతుంది.

Continues below advertisement

SIIMA Awards 2022 Winners List: సౌత్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 'సైమా'(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డుల పురస్కారం బెంగుళూరు వేదికగా ఈ శని, ఆదివారాలు ఎంతో గ్రాండ్ గా జరుగుతుంది. ఈ ఈవెంట్ కి సౌత్ ఇండియన్ యాక్టర్స్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నారు. 

Continues below advertisement

ఈవెంట్ లో భాగంగా నిన్న సాయంత్రం అవార్డులు అందుకున్న సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ అవార్డులు 'పుష్ప' టీమ్ కి దక్కాయి. బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్ ఇలా పలు కేటగిరీల్లో 'పుష్ప' సినిమా అవార్డులు కొట్టేసింది. అలానే 'జాతిరత్నాలు', 'అఖండ' సినిమాలకు కొన్ని అవార్డులు దక్కాయి. 

సైమా 2022 అవార్డ్స్ లిస్ట్:

ఉత్తమ చిత్రం: పుష్ప: ది రైజ్ (మైత్రి మూవీ మేకర్స్)

ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప: ది రైజ్)

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)

ఉత్తమ నటి: పూజా హెగ్డే(మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్)

ఉత్తమ సహాయ నటుడు: జగదీష్ ప్రతాప్ బండారి (పుష్ప: ది రైజ్)

ఉత్తమ సహాయ నటి: వరలక్ష్మి శరత్‌ కుమార్ (క్రాక్)

ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప: ది రైజ్)

ఉత్తమ సాహిత్యం: చంద్రబోస్ (శ్రీవల్లి – పుష్ప: ది రైజ్)

ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిరియాల (చిట్టి - జాతి రత్నాలు)

ఉత్తమ నేపథ్య గాయని: గీతా మాధురి (జై బాలయ్య - అఖండ)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్): నవీన్ పోలిశెట్టి (జాతి రత్నాలు)

ఉత్తమ తొలి నటుడు: పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)

ఉత్తమ తొలి నటి: కృతి శెట్టి (ఉప్పెన)

ఉత్తమ నూతన దర్శకుడు: బుచ్చిబాబు సాన (ఉప్పెన)

ఉత్తమ తొలి నిర్మాత: సతీష్ వెగ్నేస (నాంది)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సి రామ్ ప్రసాద్ (అఖండ)

ఉత్తమ హాస్యనటుడు: సుదర్శన్ (ఏక్ మినీ కథ)

Also Read: వాసన చూసి రుచి చెప్పేయొచ్చు, కృష్ణం రాజు చేపల పులుసు తయారీ వీడియో వైరల్!

Also Read : కృష్ణం రాజు ఫంక్షన్ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన సీనియర్ ఎన్టీఆర్ 

Continues below advertisement
Sponsored Links by Taboola