శృతి హాసన్.. మొదట్లో ఈమె కమల్ హాసన్ కూతురిగా మాత్రమే అందరికీ పరిచయం. సినీ హిస్టరీలో ఒక హీరో కూతురు స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన సందర్భాలు చాలా తక్కువ. కానీ, శృతిహాసన విషయంలో అలా జరగలేదు. తండ్రి పేరు సినిమాల్లోకి వచ్చేందుకు ఉపయోగపడిందేమో. కానీ, ఆమె సినిమాల్లో నిలదొక్కుకోడానికి మాత్రం.. ఆమె శ్రమ, ప్రతిభే కారణం. ఎందుకంటే.. శృతి హాసన్ కేవలం నటి మాత్రమే కాదు, మంచి సింగర్, డ్యాన్సర్ కూడా. ఆమెకున్న క్వాలిటీలు హీరోలకు కూడా ఉండవేమో. ‘రేసు గుర్రం’ సినిమాలో తన క్యూట్‌నెస్‌తో చంపేస్తూ.. తాను శృతి హాసనేనా అని కుర్రాళ్లు ఆశ్చర్యపోయారు. అయితే, ఆమె కెరీర్, అప్ అండ్ డౌన్స్‌లో ఉన్నా.. ఏనాడు వెనకడుగు వేయలేదు.


శృతి హాసన్ నటించిన ‘ది బెస్ట్ సెల్లార్’ వెబ్ సీరిస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో శృతి తనలోని వేరియేషన్స్ చాలా చక్కగా చూపించింది. మరోవైపు శృతి మళ్లీ సినిమాల్లోనూ బిజీగా ఉంది. ‘క్రాక్’ హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శృతి.. ఇప్పుడు బాలయ్య బాబు పక్కన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న NBK 107 చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


శృతి హాసన్ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె తన చిన్ననాటి వీడియోను ఒకటి పోస్ట్ చేసింది. ఆమె తండ్రి కమల్ హాసన్‌తో కలిసి తొలిసారి స్టేజ్‌పై కనిపించిన వీడియో అది. అందులో కమల్ తన కూతురిని ప్రేక్షకులకు క్రియేటివ్‌గా పరిచయం చేశారు. మ్యాజిక్ షో తరహాలో ఆమెను బాక్స్‌లో ప్రత్యక్షమైనట్లు చూపించారు. ఈ వీడియోలో శృతి చాలా క్యూట్‌గా ఉంది. ఈ వేదికపైనే ఆమె తొలిసారి ప్రేక్షకుల ముందు పాటపాడింది. ఆ విషయాన్ని శృతి క్యాప్షన్‌లో పేర్కొంది. ‘‘నేను ముందు పళ్లు లేకపోయినా పడగలను’’ అని పేర్కొంది. ఆ వీడియోను తనతో పంచుకున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. శృతి పోస్ట్ చేసిన ఆ వీడియోను మీరూ చూసేయండి. 






Also Read: రవితేజ ఆన్ డ్యూటీ - మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే ట్రైలర్ వచ్చేసిందిగా


Also Read : మెగా 154 సెట్స్‌లో రవితేజ, వెల్కమ్ చెప్పిన చిరంజీవి - మెగా మాస్ కాంబో షురూ