'ఆచార్య' బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. డబ్బులు రావడం సంగతి అటు ఉంచితే... డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన డబ్బులు చాలా పోయాయి. కొంత మందికి డబ్బులు వెనక్కి ఇచ్చారని ఫిల్మ్ నగర్ ఖబర్. ఎవరికి అయితే డబ్బులు అందలేదో... వాళ్ళు కొరటాల ఆఫీసుకు వచ్చి గొడవ చేశారు.


డిస్ట్రిబ్యూటర్లు గట్టిగా గొడవ చేయడంతో హైదరాబాద్ నగరంలో రిచ్ ఏరియా అయినటువంటి జూబ్లీ హిల్స్‌లో ఫ్లాట్ అమ్మేసి డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే... అందులో నిజం లేదని, కొరటాల శివ ఫ్లాట్ అమ్ముతున్నారనేది రూమర్ మాత్రమేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లను ఇటీవల కొరటాల శివ, 'ఆచార్య' నిర్మాత నిరంజన్ రెడ్డి కలిశారని...  ఇవ్వడానికి వాళ్ళ నష్టాన్ని కొంత పూడ్చడానికి రెడీ అయ్యారనేది నిజమేనని అంటున్నారు.


Also Read : విజయ్ దేవరకొండ మాస్ - యాక్షన్ - ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, 'లైగర్' ట్రైలర్ రిలీజ్ ఆ రోజే


'ఆచార్య'కు నష్టాలు రావడంతో హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ తమ పారితోషికం వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. నిర్మాత నుంచి సినిమాను కొని, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు అన్నీ కొరటాల శివ చూసుకోవడంతో ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది.   


Also Read : మెగా 154 సెట్స్‌లో రవితేజ, వెల్కమ్ చెప్పిన చిరంజీవి - మెగా మాస్ కాంబో షురూ