విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా 'లైగర్'. ఇందులో లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ (Mike Tyson) నటించారు. ఆ విషయం ప్రేక్షకులు అందరికీ తెలుసు. అయితే... ఆయన రోల్ ఏంటి? సినిమాలో ఏం చేస్తారు? అనేది ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా లీక్ అయ్యింది.


'లైగర్'లో మైక్ టైసన్ తన రియల్ లైఫ్ రోల్ చేస్తున్నారని టాక్. అంటే... సినిమాలో కూడా ఆయన ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపిస్తారు. టైసన్ అభిమానిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నారని సమాచారం. ఎప్పటికైనా తన అభిమాన బాక్సర్‌తో ఓ సెల్ఫీ తీసుకోవాలని ఆశపడే హీరోకి... ఒక రోజు బాక్సింగ్ రింగ్‌లో అతడితో ఫైట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందట. అప్పుడు మైక్ టైసన్ మీద విజయం సాధించడంతో పాటు రింగ్‌లో ముఖం అంతా రక్తంతో పడి ఉన్న అతడితో సెల్ఫీ తీసుకుంటాడట. అదీ 'లైగర్' క్లైమాక్స్‌లో సీన్, మేజర్ ట్విస్ట్ అని టాక్. 


Also Read : మల్లెపూలు నలిపేస్తూ ఉంటా - 'సుడిగాలి' సుధీర్


విజయ్ దేవరకొండ - మైక్ టైసన్ ట్రాక్‌తో పాటు విజయ్ దేవరకొండ - రమ్యకృష్ణ ట్రాక్ కూడా 'లైగర్'లో హైలైట్ అవుతుందని తెలుస్తోంది. త‌ల్లీకుమారుల మ‌ధ్య సెంటిమెంట్ సీన్స్ అంద‌ర్నీ కంట‌త‌డి పెట్టిస్తాయ‌ట‌. పూరి తీసిన అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి సినిమాలో కూడా మ‌ద‌ర్ సెంటిమెంట్ ఉంటుంది. అయితే... అందులో క‌థ‌కు, ఈ క‌థ‌కు చాలా వ్య‌త్యాసం ఉంటుంద‌ట‌.


Also Read : నాకు మా అమ్మాయి ఏమీ చెప్పలేదు - లలిత్ మోడీతో సుష్మితా సేన్ డేటింగ్‌పై తండ్రి స్పందన