బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన సినిమా 'లాల్ సింగ్ చద్దా' (తెలుగులో చడ్డా అని రాశారు). ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి, కింగ్ నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, సినిమాలో కీలక పాత్రలో నటించిన అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య సినిమా చూశారు. అసలు విషయం ఏంటంటే...
మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో 'లాల్ సింగ్ చద్దా' తెలుగు వెర్షన్ విడుదల అవుతోంది. ఈ విషయాన్ని చిరు స్వయంగా వెల్లడించారు. ''కొన్నేళ్ల క్రితం జపాన్ లో నా ఫ్రెండ్ ఆమిర్ ఖాన్ ను కలిశా. అప్పుడు కాసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అతని డ్రీమ్ ప్రాజెక్టు 'లాల్ సింగ్ చద్దా'లో నేనూ భాగం అయ్యాను'' అని మెగాస్టార్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తన ఇంట్లో ఎక్స్‌క్లూజివ్ ప్రీమియర్ షో వేసినందుకు థాంక్స్ చెప్పారు. ప్రివ్యూ విజువల్స్ విడుదల చేశారు.
Also Read : మళ్ళీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు
'లాల్ సింగ్ చద్దా' ఒక ఎమోషనల్ జర్నీ అని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సినిమా ఒక ఆణిముత్యం అని ఆయన అన్నారు. ఆగస్టు 11న ఈ 'లాల్ సింగ్ చద్దా' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. వయాకామ్ 18 స్టూడియోస్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి.
Also Read : మల్లెపూలు నలిపేస్తూ ఉంటా - 'సుడిగాలి' సుధీర్