లలిత్ మోడీ (Lalit Modi), సుష్మితా సేన్ (Sushmita Sen) ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు ఈ విషయంలో దాచడానికి ఏమీ లేదు. తామిద్దరం పెళ్లి చేసుకోలేదని, ప్రస్తుతానికి డేటింగ్‌లో మాత్రమే ఉన్నామని లలిత్ మోడీ స్పష్టం చేశారు. సుష్మితా సేన్ చేతి వేలికి ఉంగరం ఉండటంతో నిశ్చితార్థం జరిగిందని చాలా మంది భావించారు. అది నిజం కాదని ఆమె చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రేమ్ కహాని హాట్ టాపిక్ అయ్యింది.


లలిత్ మోడీ - సుష్మితా సేన్ ప్రేమపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది మీమ్స్, ట్రోల్స్‌తో రెచ్చిపోతున్నారు. వాళ్ళకు సుతిమెత్తగా చెక్ పెడుతూ... సుష్మితకు ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ Rohman Shawl (రోమన్ షాల్) సపోర్ట్ ఇచ్చాడనేది బాలీవుడ్ టాక్.


''ప్రేమను పంచండి. ద్వేషాన్ని కాదు'' అని రోమన్ షాల్ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పోస్ట్ చేశారు. అందులో ''ఎవరినైనా ఎగతాళి చేయడం ద్వారా మీకు నవ్వు వస్తుంటే నవ్వండి. ఎందుకంటే... అది వాళ్ళకు పరేషాన్ కాదు. మీకే'' అని రాశారు. ఈ పోస్టులో ఎవరినీ ట్యాగ్ చేయలేదు. కానీ, మీమర్స్ మీద పోస్ట్ చేశారని హిందీ జనాలు అనుకుంటున్నారు.


సుష్మితా సేన్ - లలిత్ మోడీ ప్రేమ గురించీ హిందీ మీడియాతో రోమన్ షాల్ మాట్లాడారు. ''వాళ్ళను చూసి సంతోషంగా ఉండండి. ప్రేమ చాలా అందమైనది. సుష్మితా సేన్ ఎవరినైనా ఎంపిక చేసుకుందంటే... అతడు ఆమెకు తగినవాడు, అందుకు అర్హత ఉన్నవాడు అయ్యి ఉంటాడు'' అని రోమన్ తెలిపారు.


Also Read : మల్లెపూలు నలిపేస్తూ ఉంటా - 'సుడిగాలి' సుధీర్


సుష్మితా సేన్, రోమన్ షాల్ మూడేళ్ళు రిలేషన్షిప్‌లో ఉన్నారు. 2011లో తమ బంధానికి ముగింపు పలికినట్టు సుష్మితా సేన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 


Also Read : 'గార్గి' రివ్యూ: ఎవరూ ఊహించని క్లైమాక్స్ - సాయి పల్లవి కొత్త సినిమా ఎలా ఉందంటే?